ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ ల మంజూరు కోరకు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నవంబర్ 01 / 2024 తర్వాత ఎవరైనా పెన్షన్ దారులు చనిపోతే వారి భార్య కి పెన్షన్ మంజూరు కోరకు ప్రభుత్వం గతంలోనే అవకాశం కల్పించింది.
ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి, 01/12/2023 నుండి 31/10/2024 మధ్య ఎవరైనా చనిపోతే వారి భార్యకు పెన్షన్ మంజూరు చేసేందుకు గాను స్పౌజ్ కేటగిరి క్రింద దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం మొత్తం 89788 మందిని అర్హులుగా భావిస్తుంది.
ఈ అంశానికి సంబంధించి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకొనుటకు ఎవరు అర్హులు, అవసరమగు ధ్రువపత్రాలు మరియు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు కొరకు ఎవరిని సంప్రదించాలి వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 అర్హులకు స్పౌజ్ పెన్షన్లు :
NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ నుండి పెన్షన్ దారులు మరణిస్తే,భార్యకి పెన్షన్ మంజూరు చేస్తున్నారు.
ఇందులో భాగంగా మరో ముందడుగు వేసి, 2023 డిసెంబర్ 01 నుండి మరణించిన పెన్షన్ దారుడు యొక్క భార్యకు స్పౌజ్ కేటగిరి క్రింద పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి సర్క్యులర్ మెమో ను 24/04/2025 న విడుదల చేశారు.
🔥 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :
అర్హత గల వారు వారి గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
స్పౌజ్ పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ / వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ లాగిన్ నందు అవకాశం కల్పించారు.
🔥 అవసరమగు దరఖాస్తులు:
భర్త ఆధార్ కార్డు జిరాక్స్
భర్త డెత్ సర్టిఫికెట్
భార్య ఆధార్ కార్డు జిరాక్స్
రేషన్ కార్డు జిరాక్స్
🔥 ముఖ్యమైన అంశాలు:
మొత్తం 89788 విడో పెన్షన్లు ను స్పౌజ్ కేటగిరి క్రింద మంజూరు చేయనున్నారు.
వీరికి నెలకు 4000/- రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తారు
వీరికి పెన్షన్ అందించేందుకు గాను ప్రభుత్వం ప్రతీ నెల 35.91 కోట్లను ఖర్చు చేయనుంది.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.