ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో కొత్తగా 534 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి ఆదేశాలు జారీ కావడం జరిగింది.
అనుమతి వచ్చిన పోస్టుల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సీనియర్ రెసిడెంట్ / జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు, నర్సింగ్ కేడర్ ఉద్యోగాలు మరియు ఇతర నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. ఇందులో విభాగాల వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- ఫ్యాకల్టీ పోస్టులు – 100
- సీనియర్ రెసిడెంట్ / జూనియర్ రెసిడెంట్ పోస్టులు – 100
- నర్సింగ్ క్యాడర్ పోస్టులు – 113
- ఇతర నాన్ ఫ్యాకల్టీ పోస్టులు – 171
పోస్టులు భర్తీ ముఖ్యమైన వివరాలు :
. మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ఈ పోస్టులు భర్తీ చేసేటప్పుడు ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఉన్న ఇలాంటి పోస్టుల వేతన స్థాయి / నామకరణతో సమానంగా వేతన స్థాయి మరియు నియామకాలకు అనుమతించబడిన పోస్టుల నామకరణం ఉండేవిధంగా చూడాలి అని ఆదేశించారు.
. మరి కొన్ని పోస్ట్లు సృష్టి కోరే ముందు ప్రతి గ్రేడ్ లేదా క్యాడర్ పోస్టులలో 75% పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు.
. ఈ పోస్టులకు సంబంధించిన ఖర్చును వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపు నుండి తీర్చవచ్చు అని తెలియజేశారు.
పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేయండి.
🏹 Download Vacancies List Pdf – Click here