ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఎస్సీ ఉప వర్గీకరణ పూర్తి అయిన కారణంగా వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసి, 16 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా , వివిధ డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు గాను సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. ఏపీపీఎస్సీ ద్వారా 18 నోటిఫికేషన్స్ త్వరలో విడుదల కానున్నాయి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
అటవీ శాఖలో మరియు ఇతర శాఖల్లో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
మొత్తం 866 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల సంఖ్య పెరగవచ్చు కూడా.
🔥 మరికొద్ది రోజుల్లో ఉద్యోగాల భర్తీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఉప వర్గీకరణ పూర్తి అయినందున , ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల కొరకు ఎటువంటి ఆలస్యం లేకుండా వీలనంత త్వరగా భర్తీ చేయనున్నారు.
మొత్తం 18 డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్న 866 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 100
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఆఫీసర్ – 691
డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ – 13
తన్నేదార్ – 10
అగ్రికల్చర్ ఆఫీసర్ – 10
దేవాదాయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – 07
జిల్లా సైనిక్ అధికారి – 07
ఇంటర్ విద్య గ్రంథ పాలకుడు – 02
హార్టికల్చర్ ఆఫీసర్ – 02
టెక్నికల్ అసిస్టెంట్ (ఇరిగేషన్ డిపార్ట్మెంట్) – 04
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ – 11
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – 01
జూనియర్ అసిస్టెంట్ & టైపిస్ట్ – 01
🔥 విద్యార్హత :
ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమో, బీటెక్, ఐటిఐ వంటి వివిధ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
🔥 వయస్సు :
42 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరి ఆధారంగా వయోసడలింపు లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులను ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన అంశాలు :
ఎస్సీ వర్గీకరణ పూర్తి అయినందున రోస్టర్ ప్రక్రియ కీలకం కానుంది.
ఎస్సీ వర్గీకరణ కు తగ్గట్లు గా రోస్టర్ పాయింట్ల నిర్ధారణ చేస్తారు.
రోస్టర్ ప్రక్రియ పూర్తి అయిన నెల రోజుల లోగా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఏపీపీఎస్సీ గతంలో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ లతో పాటు మిగతా అన్ని నోటిఫికేషన్ లు విడుదల చేసేందుకు అవకాశం ఉంది.
కావున అభ్యర్థులు ఇప్పటి నుండే సిలబస్ ను ఆధారంగా చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించగలరు.
పూర్తి నోటిఫికేషన్లు విడుదల అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ల యొక్క సమగ్ర సమాచారాన్ని మన Website లో తెలియజేయడం జరుగుతుంది.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు , కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.