ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్ , ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్ , ఫ్లాష్…….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లు కు దరఖాస్తు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.
ఇప్పటికే పెన్షన్ పంపిణీలో పలు భారీ మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం మరికొద్ది రోజులలోనే కొత్త పెన్షన్లు కొరకు దరఖాస్తుల చేసుకొనేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు గాను మే నెలలో దరఖాస్తులకు అవకాశం కల్పించి, జూలై నుండి పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తుంది.
🔥 ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం :
- నూతన ప్రభుత్వం వచ్చాక సామాజిక భద్రతా పెన్షన్ పథకంలో పలు సంస్కరణలు చేశారు.
- ఇందులో భాగంగా పెన్షన్ మొత్తాన్ని పెంచారు.
- వృద్ధాప్య , వితంతువు, ఒంటరి మహిళ మొదలగు కేటగిరి పెన్షన్ మొత్తాన్ని 3,000/- రూపాయల పెన్షన్ ను 4,000/- రూపాయల కి, దివ్యాంగుల వారికి 3000 రూపాయల నుండి 6,000/- రూపాయలకు పెంచారు.
- ఇంటివద్దకే పెన్షన్ ను గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నారు.
- అలానే ఒక నెల పెన్షన్ మొత్తం తీసుకోకుండా ఉంటే ఆ మొత్తాన్ని కూడా రెండవ నెల లేదా మూడవ నెల బకాయిల తో సహా చెల్లిస్తున్నారు.
- నవంబర్ 01 / 2024 తర్వాత ఎవరైనా పెన్షన్ దారులు చనిపోతే వారి భార్యకి స్పౌజ్ కేటగిరి లో పెన్షన్ మంజూరు చేస్తున్నారు.
🔥 కొత్త పెన్షన్ కు భారీగా దరఖాస్తులు :
- జూలై లో కొత్త పెన్షన్లు మంజూరు కి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
- ఈ అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం గతంలోనే సమావేశం అయ్యింది. ఈ వారంలో మరొకసారి భేటీ అయ్యి ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.
- అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయి అని SERP అధికారులు అంచనా వేస్తున్నారు.
🔥 పెండింగ్ దరఖాస్తులపై అధికారిక నిర్ణయం :
- రాష్ట్రంలో ప్రస్తుతం 63 లక్షలకు పైగా పెన్షన్లు పంచుతున్నారు. ఇందుకు గాను 2,722 కోట్లు రూపాయలు వెచ్చిస్తున్నారు.
- కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే సుమారు 250 కోట్ల అదనంగా ఖర్చు పెట్టవలసి వుంటుంది.
- గతంలో YSRCP ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల 30 వేలకు పైగా దరఖాస్తులు మంజూరు కాకుండా పెండింగ్ ఉంది.
- వీరిలో చాలా మంది అర్హులుగా ఉన్నా వారికి మంజూరు కాలేదు.
- ఇప్పుడు వారందరి నుండి మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం మరియు ప్రభుత్వ పథకాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 అర్హులకు స్పౌజ్ పెన్షన్లు :
- రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ నుండి పెన్షన్ దారులు మరణిస్తే, భార్యకి పెన్షన్ మంజూరు చేస్తున్నారు.
- ఇందులో భాగంగా మరో ముందడుగు వేసి, 2023 డిసెంబర్ 01 నుండి స్పౌజ్ కేటగిరి క్రింద పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.
- మే నెలలో దరఖాస్తులు ఆహ్వానించి, జూన్ 01 నుండి వీరికి పెన్షన్ మంజూరు చేసేందుకు గాను వీరికి అవకాశం కల్పిస్తుంది.
- ఈ కేటగిరి క్రింద 90,000 వరకు అర్హులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
🔥 పెన్షన్ తీసుకోకపోతే మొబైల్ ఫోన్ కి సమాచారం :
- గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఎవరైనా పెన్షన్ దారులు ఇంటి దగ్గర అందుబాటులో లేకపోయినా , లేదా మరే ఇతర కారణం చేత పెన్షన్ పొందకపోయినా వారికి ఇంకో నెల పాటు వేచి చూసే పని లేకుండా ఆ మరోసటి రోజు మధ్యాహ్నం పెన్షన్ పొందేందుకు గాను అవకాశం కల్పించనున్నారు.
- ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ను SERP డిపార్ట్మెంట్ వారి విడుదల చేశారు.
- ఈ సమాచారం నిమిత్తం డిపార్ట్మెంట్ వారు పెన్షన్ దారుల ఫోన్ నంబర్లను సేకరించనున్నారు.
- ఇంటివద్ద అందుబాటులో లేని పెన్షన్ దారుల సౌకర్యార్థం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి & వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి నుండి , వార్డు సచివాలయంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ & వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారు రెండవ రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుండి 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటారు.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.