ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
మే 20వ తేదీ నుంచి నమూనా పరీక్షలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
మే 30వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు.
అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజునే ప్రాథమిక “కీ” విడుదల చేస్తామని తెలియజేశారు.
ప్రాథమిక “కీ” విడుదలైన తర్వాత ఏడు రోజులు పాటు అభ్యంతరాలు స్వీకరణ చేస్తారు.
అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్ “కీ” విడుదల చేస్తారు.
ఫైనల్ “కీ” విడుదలైన వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటిస్తారు.
🏹 ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి :
- జువైనల్ సంక్షేమ విభాగం పాఠశాలల్లో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో మొత్తం 2228 పోస్టులు ఉన్నాయి.
- దివ్యాంగులు పాఠశాలలో 31 పోస్టులు ఉన్నాయి
- ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు జిల్లాల వారీగా భర్తీ చేస్తారు.
- గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అన్ని జిల్లాలు కలిపి 881 పోస్టులు ఉన్నాయి.
🔥 పూర్తి నోటిఫికేషన్, సిలబస్, పోస్టులవారీగా ఖాళీలు మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేయండి.
🏹 Official Website – Click here