షెడ్యూల్ – ఏ మినిరత్న కేటగిరి -1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రస్ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఏపీ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుండి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
UR – 125
EWS – 30
OBC (NCL) – 72
SC – 55
ST – 27
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాలను
🔥 విద్యార్హత :
ఫిజిక్స్ & మ్యాథమెటిక్స్ కలిగిన మూడు సంవత్సరాల బిఎస్సి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
(లేదా)
ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏదైనా ఒక సెమిస్టర్ లో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు కలిగి ఉండాలి.
ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
27 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు నిర్ధారణ కొరకు 24/05/2025 ను కట్ ఆఫ్ తేదీగా పరిగణించారు.
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాలు వయో సడలింపు కలదు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా అధికారికి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థులు వేయి రూపాయల దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 40,000/- బేసిక్ పేతో పాటు వివిధ అలవెన్సులు లభిస్తాయి.
అన్ని అలవెన్స్లతో కలిపి సంవత్సరానికి 13 లక్షల వరకు జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 25/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 24/05/2025
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు , కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.
👉 Click here for official website