విద్యార్థులు, నిరుద్యోగులు మీకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం గురించి తెలుసా ! కేంద్ర ప్రభుత్వమే మీకు ఉద్యోగ అవకాశం కల్పించి, జీతం కూడా ఇచ్చే ఈ పథకం కి రిజిస్టర్ చేసుకోండి. ఇప్పటికే ఒక విడత రిజిస్ట్రేషన్ పూర్తి కాగా, మళ్ళీ రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రారంభమైనది.
ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 PM ఇంటర్న్షిప్ పథకం అనగా ఏమిటి? :
- కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం – 2025 ద్వారా భారతదేశం లోని ఔత్సాహిక యువతి యువకులకు ఉద్యోగ కల్పన కొరకు అవకాశం కల్పిస్తుంది.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- 1,25,000 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 వయోపరిమితి :
- 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
🔥 విద్యార్హత :
- పదవ తరగతి,ఇంటర్మీడియట్, ఐటిఐ,డిగ్రీ,డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
🔥 ఇతర అర్హతలు :
- కుటుంబ ఆదాయ పరిమితి 8 లక్షల లోపు వుండాలి.
- కుటుంబ సభ్యులలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి అయి వుండరాదు.
🔥 స్టైఫండ్ :
- నెలకు 5,000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. మొత్తం సంవత్సరానికి 60,000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
- దీనితో పాటు వన్ టైమ్ బెనిఫిట్ క్రింద 6,000/- రూపాయలు లభిస్తాయి.
🔥 దరఖాస్తు చేయు విధానం :
- దరఖాస్తు చేసుకోవాలి అని అనుకునే వారు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
- వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అయి, విద్యార్హత అంశాలను నమోదు చేయాలి.
- అవసరమగు చోట విద్యార్హత సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి అప్లోడ్ చేసి, వివరాలను అన్నిటిని సరిచూసుకుని,చివరితేది లోగా ఫైనల్ సబ్మిట్ చేయాలి.
🔥 కాలపరిమితి :
- 12 నెలల కాలపరిమితి తో ఈ నియామకం జరుగుతుంది.
🔥 ముఖ్యమైన తేదీ :
- ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం – 2025 ఫేజ్ – 2 ప్రోగ్రాం కి ఏప్రిల్ 15 , 2025 వ తేదీ లోగా రిజిస్టర్ చేసుకోవాలి.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.
👉 Click here for registration