భారత రైల్వే సంస్థలో ఉద్యోగాల భర్తీ లో వేగం పెంచింది. గతంలో వలె కాకుండా నోటిఫికేషన్ విడుదల అయిన ఒక సంవత్సరం లోపుగానే ఉద్యోగాల భర్తీ ను పూర్తి చేస్తుంది.
2024 అసిస్టెంట్ లోకో పైలట్ భర్తీ కొనసాగుతూ ఉంది , ఇంతలోనే అసిస్టెంట్ లోకోపైలెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్ లోకో పైలెట్ – 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం వంటి అన్ని అంశాల ను ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారతదేశం లోని అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 9970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అసిస్టంట్ లోకో పైలట్ (RRB ALP)ఉద్యోగాలు
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 విద్యార్హత :
- 10 వ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటిఐ పూర్తి చేయాలి.
(లేదా)
- మెకానికల్ / ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 జోన్ల వారీగా ఖాళీల వివరాలు :
క్రమసంఖ్య | రైల్వే జోన్ | ఖాళీల వివరాలు |
1 | సెంట్రల్ రైల్వే | 376 |
2 | ఈస్ట్ సెంట్రల్ రైల్వే | 700 |
3 | ఈస్ట్ కోస్ట్ రైల్వే | 1461 |
4 | ఈస్టర్న్ రైల్వే | 768 |
5 | నార్త్ సెంట్రల్ రైల్వే | 508 |
6 | నార్త్ ఈస్టర్న్ రైల్వే | 100 |
7 | నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే | 125 |
8 | నార్తర్న్ రైల్వే | 521 |
9 | నార్త్ వెస్ట్రన్ రైల్వే | 679 |
10 | సౌత్ సెంట్రల్ రైల్వే | 989 |
11 | సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే | 568 |
12 | సౌత్ ఈస్టర్న్ రైల్వే | 796 |
13 | సదరన్ రైల్వే | 510 |
14 | వెస్ట్ సెంట్రల్ రైల్వే | 759 |
15 | వెస్టర్న్ రైల్వే | 885 |
16 | మెట్రో రైల్వే కలకత్తా | 225 |
మొత్తం | 9970 |
- ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం వుంది .
🔥 వయస్సు :
- అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి యుండి 30 సంవత్సరాలలోపు వుండాలి.
- గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.గతంలో రిజిస్టర్ అయిన వారి ఆ లాగిన్ డిటైల్స్ తో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు 500/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 250/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- CBT – 1 రాసిన వారికి కేటగిరీ ఆధారంగా అప్లై ఫీజు రిఫండ్ చేయబడుతుంది.
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష (CBT – 1 & CBT – 2) , కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ , పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 అవసరమగు పత్రాలు :
- విద్యార్హత సర్టిఫికెట్లు
- తాజా కుల ధ్రువీకరణ పత్రం
- తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం
- EWS సర్టిఫికెట్ (సంబంధిత వర్గాల వారు)
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 40 వేల నుండి 45 వేల రూపాయల వరకు జీతం లభిస్తుంది.అన్ని అలవెన్సులు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 10/04/2025.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 09/05/2025.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.
👉 Click here for official short note
👉 Click here for official website