ఇంటర్మీడియట్ విద్యార్థులు , తల్లి తండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 11వ తేదిన విడుదల చేసిన నోటీస్ ప్రకారమే ఈ ఫలితాలు ఈ రోజు 11 గంటలకు విడుదల చేశారు. ఈ రోజు 11 గంటలకు మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ఈ ఫలితాలు విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి వివరాలు కొరకు మన ఆర్టికల్ చివరి వరకు చదవండి.
ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన వివిధ అవకాశాలు ద్వారా మీరు ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు తెలుసుకోవచ్చు.
🔥 ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ముగిసింది:
ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన వెంటనే బోర్డు వారు పరీక్షా పేపర్ల మూల్యాంకనం ను ముగించారు.
ఇందుకొరకు ఎగ్జామినర్ & సహాయ ఎగ్జామినర్ లను నియమించి, మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేసారు మరియు అక్కడ అన్ని విధాల సౌకర్యాలను కల్పించారు.
మూల్యాంకనం తర్వాత కంప్యూటర్ కరణ కూడా ముగియడంతో ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు విడుదల చేసింది.
🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం :
పరీక్ష ఫలితాలను విద్యార్థులు & తల్లితండ్రులు సులభంగా తెలుసుకోవటానికి ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం ఇచ్చింది.
వాట్సాప్ ద్వారా :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 కి Hi అని మెసేజ్ చేసి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
SMS ద్వారా :
అధికారిక ఫోన్ నెంబర్ కు హల్ టికెట్ నెంబర్ మెసేజ్ చేసి , SMS పంపి ద్వారా పలితాలు తెలుసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ ద్వారా :
విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు వారి యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.