ఇంటర్ ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం | What’s App లో ” Hi ” అని మేసేజ్ చేస్తే చాలు | AP Inter Results What’s app Number | Andhra Pradesh Inter Results 2025 Released

ఇంటర్మీడియట్ ఫలితాల కొరకు ఎదురు చేస్తున్న విద్యార్థులకు, తల్లితండ్రులకు శుభవార్త ! ఏప్రిల్ 12 అనగా రేపే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 

ఏప్రిల్ 12 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు.

ఈ అప్డేట్ కు సంబంధించి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ వేయడం జరిగింది. మరియు అధికారిక వెబ్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది.

పరీక్షా ఫలితాల ముల్యాంకనం  మరియు కంప్యూటరీకరణ ముగిసినందున ప్రభుత్వం ఇటువంటి జాప్యం లేకుండా ఫలితాలను విడుదల చేస్తుంది.

ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి లింక్ మరియు వివిధ మార్గాల కొరకు మన ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🔥 ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ముగిసింది: 

ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన వెంటనే బోర్డు వారు పరీక్షా పేపర్ల మూల్యాంకనం ను ముగించారు.

ఇందుకొరకు ఎగ్జామినర్ & సహాయ ఎగ్జామినర్ లను నియమించి, మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేసారు మరియు అక్కడ అన్ని విధాల సౌకర్యాలను కల్పించారు.

మూల్యాంకనం తర్వాత కంప్యూటర్ కరణ కూడా ముగియడంతో ఫలితాలను విడుదలకు సిద్ధం చేశారు బోర్డు వారు.

🔥ఇంటర్మీడియట్  పరీక్షల ఫలితాలు విడుదల:

పరీక్షలు ముగియడంతో విద్యార్థులు & తల్లితండ్రులు ఫలితాల కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

పరీక్షలు ముగిసి దాదాపు 20 రోజులు అవుతూ ఉండడం తో అందరూ ఉత్సుకత తో పరీక్ష పలితాలు కొరకు ఆసక్తితో ఉన్నారు.

ఏప్రిల్ 12 అనగా రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు.

🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం :

పరీక్ష ఫలితాల ను విద్యార్థులు & తల్లితండ్రులు సులభంగా తెలుసుకోవటానికి బోర్డ్ వారు అనేక రకాల మార్గాలను ప్రవేశపెట్టారు.

వాట్సాప్ ద్వారా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర  వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 కి “ Hi “ అని మెసేజ్ చేసి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

SMS ద్వారా : అధికారిక ఫోన్ నెంబర్ కు హల్ టికెట్ నెంబర్ మెసేజ్ చేసి,SMS ద్వారా పలితాలు తెలుసుకోవచ్చు.

అధికారిక వెబ్సైట్ ద్వారా :విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు  వారి యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

   👉   Click here for official press note

   👉   Click here to check results 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!