భారత ప్రభుత్వం , సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ , హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల CSIR – నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) సంస్థ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ (జనరల్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ (F&A) జూనియర్ సెక్రటేరియట్ (S&P) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భారతదేశం లోని అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- CSIR – నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 17 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ (జనరల్) – 11
- జూనియర్ సెక్రటేరియట్ ( S&P) – 04
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ ( F&A) – 03
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- DoPT వారి నిబంధనల మేరకు కంప్యూటర్ టైపింగ్ లో ప్రావీణ్యత కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి 28 సంవత్సరాల లోపు వయసు కలవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా 05/05//2025 ను నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అవసరమగు ధృవపత్రాలు :
- పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్
- ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సర్టిఫికెట్
- గ్రాడ్యుయేషన్ లేదా ఇతర క్వాలిఫికేషన్లు ఏమైనా వుంటే ఆ సర్టిఫికెట్లు
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
- కుల ధృవీకరణ పత్రం
- నొఅబ్జెక్షన్ సర్టిఫికెట్ (అవసరమగు వారు)
- దివ్యాంగుల సర్టిఫికెట్
- ఇతర ధ్రువపత్రాలు ఏమైనా వుంటే ఆ ధ్రువపత్రాలు
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా 500/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష( ఓఏంఆర్ / కంప్యూటర్ ఆధారిత) మరియు టైప్ రైటింగ్ పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష విధానం :
- ఓఏంఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష వుంటుంది.
- మొత్తం 200 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిముషాలు సమయం కేటాయిస్తారు.
- పార్ట్ – 1 లో మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలకు గాను 200 మార్కులు కేటాయించారు (నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు), 90 నిముషాల సమయం కేటాయించారు.
- జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలకు గాను 150 మార్కులు , ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు.(ప్రతి ప్రశ్నకు ⅓ వ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు)
🔥 జీతం :
- వీరికి 19,900/- – 63,200 /- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
- అన్ని అలవెన్సులు లు కలిపి ప్రారంభంలో నెలకు 38,483 /- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 07/04/2025 (ఉదయం 10:00 గంటల నుండి)
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 05/05/2025 ( సాయంత్రం 6:00 గంటల లోగా)
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.