ఏప్రిల్ 29 తరువాత నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్, ANM ఫలితాలు | MHSRB Results

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో గతంలో నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ , ఏఎన్ఎం ఉద్యోగాల పరీక్ష ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. 

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు మరియు గతంలో పనిచేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని పరీక్ష రాశారు. నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా వీరికి వెయిటేజీ మార్కులు కూడా కేటాయించాల్సి ఉంటుంది. 

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతం ఈ ఫలితాల విడుదల లో జాప్యం జరుగుతుంది. ఏప్రిల్ 29వ తేదీ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే లేదా మే మొదటి వారంలో ఈ నాలుగు రకాల ఉద్యోగాల పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నారు. కాబట్టి వెయిటేజీ మార్కులు పొందే అభ్యర్థుల ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ కారణంగా కూడా ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అధికారులు చేస్తున్నారు. 

2024 నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ , ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించింది. ఈ నాలుగు రకాల ఉద్యోగాలు కలిపి మొత్తం 6,147 పోస్టులకు అప్లై చేసుకొని పరీక్ష రాసిన లక్ష మందికి పైగా అభ్యర్థులు ఫలితాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నాలుగు రకాల ఉద్యోగాల పరీక్ష ఫలితాలతో పాటు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల ఫలితాలు కూడా విడుదల చేయబోతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!