ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది.. ఏప్రిల్ 12 లేదా 13వ తేదీన ఈ ఫలితాలు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తుంది.
మార్చ్1వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, మార్చి 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించింది. జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రక్రియ కూడా ఇటీవలే బోర్డు పూర్తి చేసింది. ఫలితాల్లో తప్పులు దొరలకుండా ప్రస్తుతం అధికారులు మరోసారి తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 12 లేదా 13వ తేదీన ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయబోతున్నారు.
ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలితాలను విద్యార్థులు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకునే రూపంలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ PDF లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి.
🏹 Intermediate Board Official Website – Click here