ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP DSH Jobs Recruitment 2025 | Latest jobs in Telugu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హెల్త్,మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ , కడప వారి పరిధిలో పనిచేయవలసి వుంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, బయో స్టాటిస్టిసియన్, ల్యాబ్ అటెండెంట్, GDA / MNO / FNO ఉద్యోగాలను కాంట్రాక్ట్ ,అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం లో భాగంగా బార్థించేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి, అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు చేయు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ , కడప వారి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 9 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

ల్యాబ్ టెక్నీషియన్

రేడియోగ్రాఫర్

బయో స్టాటిస్టిసియన్

ల్యాబ్ అటెండెంట్

GDA/MNO/FNO

🔥 విద్యార్హత :

పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ల్యాబ్ టెక్నీషియన్ :

డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ లేదా B.Sc (మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించాలి.

ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సంవత్సరం అప్రెంటిస్ పూర్తి చేయాలి.

ఆంధ్ర ప్రదేశ్ పారా మెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయి వుండాలి.

 రేడియోగ్రాఫర్ : 

CRA/DGRA/DMIT కోర్సు నందు సర్టిఫికెట్ కలిగి వుండాలి.

బయో స్టాటిస్టిసియన్ : 

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కలిగి వున్న బి.ఏ (మ్యాథ్స్) / బి.ఏ (ఎకనామిక్స్) / B. Sc (మ్యాథ్స్) ఉత్తీర్ణత సాధించాలి.

ల్యాబ్ అటెండెంట్ :

పదవ తరగతి ఉత్తీర్ణత అయి వుండాలి.

ల్యాబ్ అటెండెంట్ కోర్సు / ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత సాధించాలి.

GDA / MNO / FNO :

పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.

🔥  వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.

ఎస్సీ , ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా  లో దరఖాస్తుచేసుకోవాలి.

🔥 దరఖాస్తు పంపించవలసిన చిరునామా:

District coordinator of hospital services, DSH Kadapa, O block , new collectorate, kadapa

🔥 అవసరమగు ధృవపత్రాలు :

ఫిల్ చేసిన దరఖాస్తు ఫారం

10 వ తరగతి  సర్టిఫికెట్లు

అన్ని విద్యార్హతలు సర్టిఫికెట్లు

కౌన్సిల్ / బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

ఇటీవల కుల దృవీకరణ పత్రం

4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు

సదరం సర్టిఫికెట్ ( అవసరమగు వారు)

EWS సర్టిఫికెట్ ( అవసరమగు వారు)

స్పోర్ట్స్ సర్టిఫికెట్ ( అవసరమగు వారు)

సర్వీస్ సర్టిఫికెట్ ( అవసరమగు వారు)

డిమాండ్ డ్రాఫ్ట్ 

పైన పేర్కొన్న ధృవపత్రాలు యొక్క కాపీలు పై గెజిటెడ్ అధికారి వారి సంతకం వుండాలి.

🔥 ఎంపిక విధానం :

అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అకడమిక్ విద్యార్హత లో మార్కులకు 75 శాతం వెయిట్ఏజ్ ,  15 శాతం గత అనుభవం కి , 10 శాతం విద్య లో సీనియారిటీ కి కేటాయించారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

OC అభ్యర్థులు 500/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ,బీసీ, దివ్యాంగులు 300/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

DCHS, Kadapa వారి పేరు మీదుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

🔥 జీతం:

ల్యాబ్ అటెండెంట్, GDA/MNO/FNO గా ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- రూపాయల జీతం లభిస్తుంది.

బయో స్టాటిస్టిసియన్ గా ఎంపిక అయిన వారికి నెలకు 18,500/- రూపాయల జీతం లభిస్తుంది.

రేడియోగ్రాఫర్ గా ఎంపిక అయిన వారికి 35,570/- రూపాయల జీతం లభిస్తుంది.

ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంపిక అయిన వారికి 32,670/- రూపాయల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 08/04/2025

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16/04/2025

👉  Click here to download notification and application 

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!