AP ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం | 40/- రూపాయలు చెల్లించి ఈ కార్డ్ తీసుకోండి | AP Senior Citizens Cards | AP Grama Sachivalayam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 సంవత్సరాల వయసు దాటిన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు వైద్య సదుపాయాలు &  ప్రభుత్వ పథకాలు & బ్యాంకింగ్ సేవలు & ప్రయాణం లో రాయితీలు కల్పించేందుకు గాను డిజిటల్ పద్ధతిలో సీనియర్ సిటిజన్ కార్డులను అందజేయనుంది.

ఈ సీనియర్ సిటిజన్ కార్డులు వలన కలుగు ఉపయోగాలు & ఈ కార్డులను ఏ విధంగా పొందాలి ? అనే పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను వరకు చదవండి.

 🔥సీనియర్ సిటిజన్ కార్డులు ఎవరికి ఇస్తారు ?

రాష్ట్రంలో 60 సంవత్సరాలు  దాటిన వృద్ధులకు రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్డులను జారీ చేయనుంది.

🔥 సీనియర్ సిటిజన్ కార్డులు – ప్రయోజనాలు :

వైద్య సదుపాయాలు :

వృద్ధులు ఎప్పుడైనా ఆసుపత్రి కి వెళ్తే వీరికి సాధారణ క్యూ లైన్ తో  కాకుండా కార్డు కలిగి వున్న వారికి ప్రత్యేక క్యూ ద్వారా వైద్య  కల్పిస్తారు మరియు మందులు కొనుగోలు , డైగ్నోస్టిక్ పరీక్షలలో రాయితీలు కల్పిస్తారు.

బ్యాంకింగ్ & ఆర్థిక సదుపాయాలు :

ఈ కార్డు కలిగి వున్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్ (FD)  మరియు సేవింగ్ పథకాలలో అధిక వడ్డీ లభిస్తుంది. మరియు సేవలను వేగవంతం చేయుట.

ప్రభుత్వ పథకాలు & పెన్షన్లు :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి కొరకు ప్రవేశపెట్టే పథకాలు అందచేయుట కు వీలు కల్పిస్తుంది  మరియు పెన్షన్ కార్యక్రమంలో ఉపయోగ పడుతుంది.

ఇందిరాగాంధీ నేషనల్ పెన్షన్ స్కీమ్ కి అర్హత &  ప్రభుత్వం కల్పించే సబ్సిడీ లు లభిస్తాయి.

ప్రయాణాలలో రాయితీలు : 

భారత రైల్వే సంస్థ కల్పిస్తున్న వివిధ రాయితీలు లభిస్తాయి.

60 సంవత్సరాలు నిండిన పురుషులకు, 58 సంవత్సరాలు నిండిన మహిళలకు రైల్వే సంస్థ 40 శాతం మేరకు టిక్కెట్లు లో రాయితీ కల్పిస్తుంది. 80 ఏళ్లు దాటిన వారికి 50 శాతం మేర రాయితీ లభిస్తుంది.

ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధి మేరకు రాయితీలు ప్రకటిస్తుంది.

కొన్ని ప్రైవేట్ బస్ సర్వీసులు, ఎయిర్ సర్వీసులు లలో కూడా రాయితీ ఇస్తున్నారు.

మరిన్ని సదుపాయాలు : 

ఇవే కాకుండా కొన్ని ఇతర సంస్థలు & ప్రైవేట్ యాజమాన్యాలు సీనియర్ సిటిజన్ కోటాలో వివిధ సేవలు కల్పిస్తున్నారు.

వివిధ మ్యూజియం లు ,సినిమా హాళ్లు, పార్కుల్లో సీనియర్ సిటిజన్ లకు ప్రవేశ రుసుము లో మినహాయింపు లేదా రాయితీ కల్పిస్తున్నారు.

🔥 సీనియర్ సిటిజన్ కార్డ్ – ప్రధాన లక్ష్యాలు : 

వృద్ధులు యొక్క ఆర్థిక భద్రత & వారికి మేలైన వైద్య సదుపాయాలు & ప్రభుత్వ ప్రయోజనాలు ను సులభంగా కల్పించేందుకు ఈ కార్డులను ప్రవేశ పెట్టారు.

 🔥 సీనియర్ సిటిజన్ కార్డులను ఎలా పొందాలి ? & ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీరి సౌకర్యార్థం ఈ కార్డులను పొందేందుకు గాను గ్రామ మరియు వార్డు సచివాలయం లలో అవకాశం కల్పించారు.

గ్రామ వార్డు సచివాలయం లలో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్త సర్వీసు ను ఏర్పాటు చేసారు.

ఈ అంశానికి సంబంధించి ఇటీవల  వెలగపూడి నందు గల రాష్ట్ర సచివాలయంలో జరిగిన సీనియర్ సిటిజన్ కౌన్సిల్ & స్టేట్ అడ్వైజరీ బోర్డు ఆన్ డిజిబిలిటి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

🔥 దరఖాస్తు చేయు విధానం :

దరఖాస్తు చేయు తేదీ నాటికి 60 సంవత్సరాలు నిండి యున్న వారి ఈ కార్డు పొందేందుకు అర్హులు

గ్రామ సచివాలయం లో అయితే డిజిటల్ అసిస్టెంట్లు & వార్డు సచివాలయం లో డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ లు ఈ కార్డ్ ల కోరకు రిజిస్టర్ చేస్తారు.

రిజిస్టర్ చేసేటప్పుడు వృద్ధులకు సహాయకారిగా ఉన్న వారి కుటుంబ సభ్యుల పేరు & ఫోన్ నెంబర్ కూడా నమోదు కొరకు ఇవ్వాలి.

రిజిస్టర్ చేసిన 7 రోజులలో  అప్రూవ్ చేయబడిన తర్వాత సచివాలయం లో కార్డ్ యొక్క ప్రింట్ ను పొందవచ్చు.

రిజిస్ట్రేషన్ కొరకు 40/- రూపాయల సర్వీస్ రుసుము చెల్లించాల్సి వుంటుంది.

🔥 అవసరమగు ధృవ పత్రాలు :

ఆధార్ కార్డు

పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

ఆధార్ అప్డేట్ హిస్టరీ కాపీ

ఆధార్ కార్డు కి లింక్ కాబడిన ఫోన్ నెంబర్

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!