ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. ఫలితాలు సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు బోర్డు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
మార్చ్ 1 నుండి మార్చ్ 19 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు & మార్చ్ 3 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ను ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వారు వీలైనంత త్వరగా మూల్యాంకనం ను పూర్తి చేసి, ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
✅ AP ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం – Click here
🔥 ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం :
ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన వెంటనే బోర్డు వారు పరీక్షా పేపర్ల మూల్యాంకనం ప్రారంభించారు.
ఇందుకొరకు ఎగ్జామినర్ & సహాయ ఎగ్జామినర్ లను నియమించి, మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేసారు మరియు అక్కడ అన్ని విధాల సౌకర్యాలను కల్పించారు.
🔥 వేగవంతంగా సాగుతున్న ఇంటర్ పరీక్షల మూల్యాంకనం :
మూల్యాంకనం కేంద్రాలలో పరీక్ష పేపర్ల మూల్యాంకనం వేగంగా సాగుతుంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్ష పత్రాలను వేరు వేరుగా ఎగ్జామినర్ లు & సహాయక ఎగ్జామినర్ లు దిద్దుతున్నారు.
ఇప్పటికే 90 శాతానికి పైగా పేపర్లు దిద్దుబాటు పూర్తి అయ్యింది.
✅ AP రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలు నోటిఫికేషన్ – Click here
🔥ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల:
పరీక్షలు ముగియడంతో విద్యార్థులు & తల్లితండ్రులు ఫలితాల కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
పరీక్షలు ముగిసి దాదాపు 20 రోజులు అవుతూ ఉండడం తో అందరూ ఉత్సుకత తో పరీక్ష పలితాలు కొరకు ఆసక్తితో ఉన్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు వారు వీలైనంత త్వరగా ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి , ఫలితాలు విడుదల చేసేందుకు గాను సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం ఏప్రిల్ 12 లేదా 13 వ నాటికి పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం :
పరీక్ష ఫలితాల ను విద్యార్థులు & తల్లితండ్రులు సులభంగా తెలుసుకోవటానికి బోర్డ్ వారు అనేక రకాల మార్గాలను ప్రవేశపెట్టారు.
వాట్సాప్ ద్వారా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 కి Hi అని మెసేజ్ చేసి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
SMS ద్వారా : అధికారిక ఫోన్ నెంబర్ కు హల్ టికెట్ నెంబర్ మెసేజ్ చేసి, SMS ద్వారా పలితాలు తెలుసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ ద్వారా :విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు వారి యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.