Headlines

పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది | AP SSC Results 2025 | AP 10th Results 2025 | Andhra Pradesh 10th Results Date

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు కు సంబందించి ముఖ్యమైన సమాచారం వచ్చింది.. పదో తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా  ముగిసాయి. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసారు. ఏప్రిల్ 01 , 2025 న చివరి పరీక్ష సోషల్ పరీక్ష జరిగింది. మొదటిగా మార్చ్ 31 న చివరి  పరీక్ష ను నిర్వహించాలి అని భావించినా రంజాన్ పండగ సందర్భంగా ఏప్రిల్ 01 న నిర్వహించారు.

మొత్తం 2800 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి.

అయితే విద్యార్థుల పరీక్ష ఫలితాలు ను చెక్ చేసుకొనేందుకు ఎక్కువ సమయం వేచివుండాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వివిధ విధానాలను అవలంబిస్తుంది.

ఇందులో భాగంగా అతి త్వరగా  రిజల్ట్స్ తెలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా & SMS ద్వారా &  అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకొనేందు అవకాశం కల్పించనున్నారు.

🔥 పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం : 

పదవ తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం కొరకు ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వారు అన్ని ఏర్పాట్లు చేసారు. 

ఏప్రిల్ 03 నుండి మూల్యాంకనం ప్రారంభమైనది. మొత్తం 26 జిల్లాలలో 26 జిల్లా కేంద్రాలలో మూల్యాంకనం కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఎగ్జామినర్ & సహాయ ఎగ్జామినర్ లను నియమించి , ప్రశ్న పత్రాలు ముల్యాంకనం జరుగుతుంది. సహాయ ఎగ్జామినర్ రోజుకు 40  జవాబు పత్రాలను దిద్దే విధంగా ఏర్పాటు చేశారు. అలానే ముల్యాంకన కేంద్రాలలో సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.

🔥పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల :

పరీక్షలు ముగియడంతో విద్యార్థులు & తల్లితండ్రులు ఫలితాల కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషనన్ వారు వీలైనంత త్వరగా ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి , ఫలితాలు విడుదల చేసేందుకు గాను సిద్ధంగా ఉంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం మే నెల రెండవ వారం నాటికి పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం :

వాట్సాప్ ద్వారా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర  వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

పలితాలు విడుదల కానే ఆటోమేటిక్ గా పలితాలు రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు వస్తాయి.

SMS ద్వారా : అధికారిక ఫోన్ నెంబర్ కు హల్ టికెట్ నెంబర్ మెసేజ్ చేసి,SMS ద్వారా పలితాలు తెలుసుకోవచ్చు.

అధికారిక వెబ్సైట్ ద్వారా :విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (APBSE) వారి యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

 🔥 Click here for official APBSE website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!