ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 విద్యార్హత :
- పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ నింపి, సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి, విశాఖపట్నం లో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం లో అందజేయాలి.
🔥దరఖాస్తు అందచేయవలసిన చిరునామా :
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం , విశాఖపట్నం
🔥 ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000/- జీతము ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 03/04/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 07/04/2025.
👉 Click here to download notification & Application
👉 Official Website – Click here