ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో గల వివిధ ఉద్యోగాలను ప్రభుత్వం అతి త్వరలో భర్తీ చేయనుంది.
గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో ప్రకటన జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా , శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు తెలిపారు. అలాగే ఉన్నత చదువులు చదివిన సచివాలయం ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు.
ఇందులో భాగంగా గ్రామ సచివాలయంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు,వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు,మహిళా పోలిసులు, ANM,VRO, సర్వేయర్, వార్డు అడ్మిన్ సెక్రెటరీ, శానిటేషన్ సెక్రెటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, అనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్, సెరీకల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థుల అవగాహన కోసం రాబోయే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- APPSC / DSC ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 14,000 వేలకు పైగా ఖాళీలను గతంలో గుర్తించారు.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి ఏదైనా డిగ్రీ / సంబంధిత ఉద్యోగ విభాగంలో డిప్లొమా /డిగ్రీ / ఇతర కోర్సులు లు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 గమనిక : ఈ ఉద్యోగాన్ని భర్తీ కోసం ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మా వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరియు మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా మీకు తెలియజేస్తాం.