ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ప్రశాంతంగా నిర్వహించిన ఏపీపీఎస్సీ ఎట్టకేలకు మెయిన్స్ పరీక్ష ఫలితాలు మరియు పరీక్ష ఫైనల్ ‘ కీ ‘ ను విడుదల చేసింది.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 79,451 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్పోర్ట్స్ మరియు సాధారణ కోటాతో కలిపి 1:2 నిష్పత్తిలో 2,517 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు ఏ రోజున హాజరు కావాలి అనేది వ్యక్తిగతంగా తెలియజేయునన్నారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తెలియజేయలేదు. కేవలం హాల్ టికెట్ నెంబర్స్ మాత్రమే వెల్లడించారు. వ్యక్తిగత మార్కుల వివరాలు వెల్లడించాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీను కోరుతున్నారు..
హైకోర్టులో రోస్టర్ కేసు :
గ్రూప్-2 రిక్రూట్మెంట్ రోస్టర్ పాయింట్స్ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. హైకోర్టు తుది తీర్పు ఆధారంగానే తుది నియామక ప్రక్రియ ఉంటుందని ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు.
🏹 అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి గ్రూప్-2 ఫైనల్ ‘ కీ ‘ మరియు ఫలితాలు తెలుసుకోవచ్చు.
✅ APPSC GROUP-2 Results – Click here