ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
🔥 ఏటీఎం కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రైస్ కార్డులు మంజూరు ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏటీఎం కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
ఈ కార్డు QR కోడ్ భద్రతా ఫీచర్ ను కూడా కలిగి వుంటుంది.
కార్డు ముందు భాగంలో కార్డు నెంబర్ కలిగి వుంటుంది.
కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల అందరి వివరాలను కలిగి వుంటుంది.
రేషన్ కార్డ్ పై ఎటువంటి వ్యక్తుల పేర్లు ఉండవు.
🔥 రేషన్ కార్డు EKYC కి గడువు పెంపు :
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల రేషన్ పొందుతున్న వారు అందరికీ అధికారులు ముఖ్య సూచన చేసారు.
ఇప్పటి వరకు ఒక్క సారి కూడా EKYC పూర్తి చేసుకొని వారు తప్పనిసరిగా EKYC పూర్తి చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ మరియు సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు ఈ EKYC ప్రక్రియను పూర్తి చేయవసిందిగా ఆదేశించారు.
ఇందుకు గాను మొదటిగా మార్చ్ 31 వ తేది ను గడువుగా పేర్కొన్నప్పటికీ , ఇంకా చాలా మంది పౌరుల EKYC పూర్తి కానందున ఈ గడువును ఏప్రిల్ 30 తేదీ వరకు పొడిగించారు.
EKYC పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి అన్న అంశం పై స్పష్టత లభిస్తుంది అని మంత్రి గారు తెలియచేశారు.
🔥 EKYC చేసుకొనే విధానం :
పౌరులు గ్రామంలోని రేషన్ డీలర్ల వద్ద ఉన్న లిస్ట్ ల ద్వారా EKYC పూర్తి అయ్యింది కానిది చెక్ చేసుకోవచ్చు.
పౌరులు EKYC పూర్తి కాకపోతే వారు సంబంధిత రేషన్ డీలర్ వద్ద మరియు గ్రామ సచివాలయం సిబ్బంది వద్ద EKYC పూర్తి చేసుకోవచ్చు.
🔥 మే నెలలో కొత్త రేషన్ కార్డుల మంజూరు :
మే నెల లో కొత్త రేషన్ కార్డులు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
ఇందులో భాగంగా కుటుంబ సభ్యుల జోడింపు & కుటుంబ సభ్యుల తొలగింపు & కుటుంబ సభ్యుల విభజన వంటి అవకాశాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియకు ప్రారంభచనున్నారు.
🔥 ప్రజలకు మరింత లబ్ధి :
పౌరులకు ATM సైజ్ కార్డులను మంజూరు చేయడం ద్వారా ప్రజలందరికీ సౌకర్యంగా & సౌలభ్యంగా సేవలు అందించనున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మెరుగైన & పారదర్శకమైన రేషన్ పంపిణీ చేయుటను అవకాశం కల్పించనున్నారు.