ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో గల కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నుండి నర్సింగ్ ఆఫీసర్ (లెవెల్ -07) ఉద్యోగాలను భర్తీ చేయు నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, ఎంపిక విధానం మొదలగు
పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ జరుపుతుంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
733 ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇందులో బ్యాక్లాగ్ పోస్ట్లు 107 & జనరల్ రిక్రూట్మెంట్ లో 626 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి బి.ఎస్సీ (హానర్స్) నర్సింగ్ / బి.ఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి లేదా బి.ఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్) / పోస్ట్ బేసిక్ బి.ఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి.
ఏదైనా రాష్ట్ర లేదా భారత నర్సింగ్ కౌన్సిల్ నందు నర్స్ & మిడ్ వైఫరీ గా రిజిస్టర్ అయి వుండాలి.
(లేదా)
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ నందు డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
ఏదైనా రాష్ట్ర లేదా భారత నర్సింగ్ కౌన్సిల్ నందు నర్స్ & మిడ్ వైఫరీ గా రిజిస్టర్ అయి వుండాలి.
50 పడకల ఆసుపత్రి నందు 2 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
🔥 వయస్సు :
18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ & ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
PWBD వారికి 15 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 01/01/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్ధులు 2360 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 1416 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CRT) నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CRT) :
ఆన్లైన్ లేదా OMR ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
100 మార్కులకు గాను 2 గంటల సమయం కేటాయిస్తారు.
ఇందులో జనరల్ ఇంగ్లీష్ కు 10 మార్కులు & జనరల్ నాలెడ్జ్ కు 10 మార్కులు & రీజనింగ్ కు 10 మార్కులు & మాథెమాటిక్స్ ఆప్టిట్యూడ్ కు 10 మార్కులు & నర్సింగ్ సంబంధిత సబ్జెక్టు కు 60 మార్కులు కేటాయించారు.
🔥 జీతం :
ఎంపిక కాబడిన అభ్యర్థులకు దాదాపుగా 80,000/- రూపాయలకు పైగా జీతం లభించవచ్చు.
🔥 ముఖ్యమైన అంశాలు :
ఎంపిక కాబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాటికి ఉత్తర ప్రదేశ్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి వుండాలి.
పరీక్ష కేంద్రాలను KGMU , లక్నో వారు ఆలోకేట్ చేస్తారు.
పరీక్ష యొక్క అడ్మిట్ కార్డు అభ్యర్థులకు మెయిల్ చేయబడుతుంది & అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష సిలబస్ ను KGMU వెబ్సైట్ లో పొందుపరిచారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి & ఫీజు పేమెంట్ చేయడానికి ప్రారంభ తేది : 07/05/2025
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి & ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేది : 14/05/2025
👉 Click here for official website