భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో గల CSIR – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NEERI) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు తేది : 01/04/2025 నుండి 30/04/2025 లోగా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్, ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్స్ & పర్చెజ్) , జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి, అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు చేయు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- CSIR – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NEERI) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 33 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) – 14
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ & అకౌంట్స్) – 05
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్ & పర్చేజ్) – 07
- జూనియర్ స్టేనోగ్రాఫర్ – 07
🔥 విద్యార్హత :
1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి & కంప్యూటర్ పై ఇంగ్లీష్ భాష లో నిముషానికి 35 పదాలు లేదా హిందీ లో 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
2. జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి. 10 నిముషాలలో 80 పదాలు డిక్టేషన్ చేయగలిగే , ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్ లో 50 నిముషాలు , హిందీ లో అయితే 65 నిముషాలు స్టేనోగ్రాఫి నైపుణ్యం కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 28 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు మొదటిగా ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు 500/- రూపాయల దరఖాస్తు ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మాన్ కి దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు కలదు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష , ప్రోఫిషియన్సీ పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 2 పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి నెలకు 36493/- రూపాయలు జీతం లభిస్తుంది.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7వ సిపిసి ప్రకారం లెవెల్ – 4 పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి నెలకి 49,623/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 01/04/2025 ఉదయం 9:30 గంటల నుండి.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 30/04/2025 సాయంత్రం 5:00 గంటల లోగా అప్లై చేయాలి.
👉 Click here for official website