భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ ఇస్రో టెలీమెట్రి ట్రాకింగ్ & కమాండ్ నెట్వర్క్ , బెంగళూరు (ISTRAC) సంస్థ నుండి ఒక సంవత్సర కాలపరిమితి తో అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
బి.ఈ/బి.టెక్/ డిప్లొమా/ ఐటిఐ విద్యార్హత కలిగిన వారు ఈ రిక్రూట్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇస్రో టెలీమెట్రి ట్రాకింగ్ & కమాండ్ నెట్వర్క్ , బెంగళూరు (ISTRAC) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 75 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 35
- డిప్లొమా అప్రెంటిస్ – 05
- ట్రేడ్ (ఐటిఐ) అప్రెంటిస్ – 35
🔥 విద్యార్హత :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో బి.ఈ/ బి.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.
- లైబ్రెరీ సైన్స్ విభాగంలో అప్రెంటిస్ కొరకు MLISc ఉత్తీర్ణత సాధించాలి.
- డిప్లొమా అప్రెంటిస్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- ట్రేడ్ (ఐటిఐ) అప్రెంటిస్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ లో రిజిస్టర్ అయి వుండాలి.
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా సంబంధిత దృవపత్రాలను 21/04/2025 లోగా ఇమెయిల్ చేయాలి. ఇమెయిల్ లో ఏ కేటగిరీ కి దరఖాస్తు చేస్తున్నారో ప్రస్తావించాలి. (Application for above mentioned Apprenticeship Category)
🔥 మెయిల్ చేయవలసిన ధృవపత్రాలు :
- పదవ తరగతి మార్క్స్ కార్డ్ / సర్టిఫికెట్
- ఐటిఐ మార్క్స్ కార్డ్ / సర్టిఫికెట్
- డిగ్రీ / డిప్లొమా కి సంబంధించి అన్ని సంవత్సరాల / సెమిస్టర్స్ యొక్క మార్క్స్ కార్డ్
- డిగ్రీ / డిప్లొమా సర్టిఫికేట్ / ప్రోవిషనల్ సర్టిఫికెట్
- NATS ఎన్రోలెంట్ నెంబర్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ నిర్వహణ తేది & వేదిక & ఇమెయిల్ ఐడి :

🔥 స్టైఫండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గా ఎంపిక అయిన వారికి 9,000/- రూపాయలు & డిప్లొమా అప్రెంటిస్ గా ఎంపిక అయిన వారికి 8,000/- రూపాయలు & ట్రేడ్ అప్రెంటిస్ గా ఎంపిక అయిన వారికి 7,000/- రూపాయలు స్టైఫండ్ నెలవారీ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా సంబంధిత దృవపత్రాలను 21/04/2025 లోగా ఇమెయిల్ చేయాలి.
👉 Click here for NATS registration