భారత ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ , రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ యొక్క సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C – DOT) నుండి టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయు ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు,వయో పరిమితి ,ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C – DOT) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 ఖాళీల సంఖ్య :
- 29 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- మెకానికల్ / ఇన్ఫర్మేషన్ సిస్టమ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో 60 శాతం మార్కులతో డిప్లొమా లేదా బి.ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 వయో పరిమితి :
- 25 సంవత్సరాలు లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు నిర్ధారణ కి దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన చివరి తేదీ ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
- కేటగిరీల వారీగా వయోసడలింపు లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 జీతం :
- 7వ CPC ప్రకారం పే లెవెల్ – 4 వర్తిస్తుంది.
- వీరికి 25,500 – 81,100/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులును వ్రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరిక్ష :
- 100 మార్కులకు గాను వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. 90 నిముషాల సమయం కేటాయించారు.
- వ్రాత పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారం గా ఎంపిక ఉంటుంది.
- స్కిల్ టెస్ట్ నిర్వహిస్తే ఆది కేవలం క్వాలిఫైయింగ్ గా వుంటుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 26/03/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల అయిన 30 రోజుల వరకు
👉 Click here for advertisement