భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) , మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ సంస్థ నుండి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ , డిప్లొమా అప్రెంటిస్ , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం , స్టైఫండ్ వంటి అన్ని అంశాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) , మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 122 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- ట్రేడ్ అప్రెంటిస్ – 92
- డిప్లొమా అప్రెంటిస్ – 14
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 16
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
- ట్రేడ్ అప్రెంటిస్:
- ఫిట్టర్ – 29
- మెకానిస్ట్ -04
- టర్నర్ – 1
- వెల్డర్ – 12
- D మాన్ (మెకానికల్) – 01
- ఎలక్ట్రీషియన్ – 25
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 04
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 06
- కార్పెంటర్ – 01
- ప్లంబర్ – 01
- మాసాన్ – 01
- D మాన్ (సివిల్) – 03
- కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రాం అసిస్టెంట్ – 04
- ట్రేడ్ అప్రెంటిస్:
- డిప్లొమా అప్రెంటిస్ :
- మెకానికల్ – 07
- ఎలక్ట్రికల్ – 04
- ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్- 02
- సివిల్ – 01
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
- హ్యూమన్ రిసోర్సెస్ – 07
- కాంట్రాక్ట్స్ & మెటీరియల్ మేనేజ్మెంట్ – 03
- ఫైనాన్స్ & అకౌంట్స్ – 02
- HPU – 02
- కెమికల్ ల్యాబ్ – 02
🔥 విద్యార్హత :
- ట్రేడ్ అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- డిప్లొమా అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
🔥 వయస్సు :
- ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
- డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
- వయస్సు నిర్ధారణ కొరకు 30/04/2025 ను కట్అఫ్ తేది గా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు & ఓబీసీ వారికి 3 సంవత్సరాలు & PwBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులను ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా చేస్తారు.
🔥 స్టైఫండ్ :
- ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 7,700/- రూపాయలు ఇస్తారు.
- డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 8,000/- రూపాయలు ఇస్తారు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 9,000/- రూపాయలు ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 30/04/2025