తెలంగాణ లో నిరుద్యోగులు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న నోటిఫికేషన్ కి సంబంధించి అధికారిక గవర్నమెంట్ ఆర్డర్ G.O ఈరోజు విడుదల అయ్యింది.
తేది 29/03/2025 న పబ్లిక్ సర్వీసెస్ లో భాగం గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో గ్రామ పాలన అధికారి (Grama Palana Officers ) ఉద్యోగాల భర్తీ కి సంబంధించి G.O Rt.No 129 ను ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రభుత్వం గ్రామాలలో పరిపాలన బలపరచడం కొరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అన్న విషయం తెలిసినదే.. ఈ ఉద్యోగాలను గ్రామ పాలనా అధికారులు అని పిలుస్తున్నారు.
గ్రామ పాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించి సమగ్ర సమాచారం మొత్తాన్నీ కూడా ఈ G.O లో ప్రస్తావించారు.
నిరుద్యోగులతో పాటు గతంలో VRO , VRA లుగా వారిని మళ్ళీ G.P.O (గ్రామ పాలనా అధికారి) లగా నియామకం చేసేందుకు గాను అవసరమగు అర్హతలను కూడా ఈ G.O లో ప్రస్తావించడం జరిగింది.
గ్రామ పాలన అధికారి ఉద్యోగానికి సంబంధించి అవసరమగు అర్హతలు & ఎంపిక విధానం వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 10,954 గ్రామ పాలనా అధికారి ఉద్యోగాల నిమామకం జరగనుంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గ్రామ పాలనా అధికారి ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 విద్యార్హత :
- గ్రామ పాలనా అధికారిగా ఎంపిక కావడానికి అవసరమగు కనీస అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
(లేదా)
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి కనీసం 5 సంవత్సరాలు VRO గా పనిచేసి వుండాలి / జూనియర్ అసిస్టెంట్ / రికార్డ్ అసిస్టంట్ స్థాయి రెగ్యులర్ సర్విస్ VRA గా పని చేసి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి 46 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు , Ex – సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥 ఉద్యోగ బాధ్యతలు :
- గ్రామ పాలనా అధికారులు గా నిర్వర్తించిన బాధ్యతలు & విధులు గురించి G.O లో తెలియచేశారు.
- గ్రామ అకౌంట్లను మెయింటైన్ చేయాలి.
- వివిధ ధ్రువపత్రాలు ను ఇచ్చేందుకు గాను ఎంక్వేరీ చేయాల్సి వుంటుంది.
- ప్రభుత్వ భూములు,చెరువులు,నీటి కుంటలు ను సంరంక్షించుట , ఆక్రమణలు ను ఎంక్వైరీ చేయాలి.
- భూ తగాదాలను ఇన్వెస్టిగేషన్ చేయుట మరియు భూములను సర్వే చేయుటలో సర్వేయర్ లకు సహాయం చేయాలి.
- విపత్తు నిర్వహణ విధులు చేయుట & అత్యవసర సర్వీసులను అందించుట.
- వివిధ సంక్షేమ పథకాల & అభివృద్ధి ప్రాజెక్టుల లబ్ధిదారులను గుర్తించాలి.
- ఎన్నికల కు సంబంధించిన విధులు నిర్వహణ & ప్రోటోకాల్ అధికారులకు సహకరించాలి.
- గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలలో వివిధ ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు సహకరించాలి.
- ప్రభుత్వం, చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి వారు లేదా తహసిల్దార్ లు ఇచ్చే ఇతర విధులును కూడా నిర్వర్తించాలి.
🔥దరఖాస్తు విధానం :
- నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి.
🔥 జీతం :
- నెలకు 45,000 /- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక చేయు విధానం :
- అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గాను వ్రాత పరీక్ష నిర్వహించి ,పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా ,మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
🔥 నోట్ :
- ఈ ఉద్యోగాలకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది, నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత పూర్తి వివరాలను మరో ఆర్టికల్ లో తెలియచేయడం జరుగును.
👉 Click here to Download official G.O