భారతదేశ ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ మరియు మాన్యుఫాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ అయినటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) సంస్థ నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్ & ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఉద్యోగాలను 2 సంవత్సరాల కాలపరిమితి కొరకు రిక్రూట్ చేయనున్నారు
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 AP లో కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు భర్తీ – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 33 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – 17
- ప్రాజెక్ట్ సూపర్వైజర్ – 16
🔥 విద్యార్హత :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ :
- ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- SC, ST అభ్యర్ధులు కి 50 శాతం మార్కులు & మిగతా అభ్యర్ధులు 60 శాతం మార్కులు వచ్చి వుండాలి.
- ప్రాజెక్ట్ సూపర్వైజర్ :
- ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- SC, ST అభ్యర్ధులు కి 50 శాతం మార్కులు & మిగతా అభ్యర్ధులు 60 శాతం మార్కులు వచ్చి వుండాలి.
🔥 అనుభవం :
- అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 32 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఓబీసీ ( NCL) వారికి 3 సంవత్సరాలు & ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు దివ్యాంగులు కి 10 సంవత్సరాలు,వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆ అప్లికేషన్ ను ప్రింట్ తీసి , సంతకం చేసి , పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి ,క్రింది చిరునామాకు పంపాలి.
- ఎన్వలప్ పై “Application for the post of project engineer / supervisor” అని ప్రస్తావించాలి.
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా :
- AGM (HR), Bharat Heavy Electricals Limited, Electronics Division, P. B.No. 2606, Mysore Road, Bengaluru-560026.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ , EWS, ఓబీసీ వారు 200/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ : మొదటి సంవత్సరం నెలకు 84,000/- రూపాయల జీతం లభిస్తుంది & రెండవ సంవత్సరం నెలకు 88,000/- రూపాయల జీతం లభిస్తుంది.
- ప్రాజెక్ట్ సూపర్వైజర్ : మొదటి సంవత్సరం నెలకు 45,000/- రూపాయల జీతం లభిస్తుంది & రెండవ సంవత్సరం నెలకు 48,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 26/03//2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 16/04/2025
- హార్డ్ కాపీ చేరవేయడానికి చివరి తేది : 19/04/2025
- సుదూర ప్రాంతాలు వారు (far flung areas) హార్డ్ కాపీ చేరవేయడానికి చివరి తేది : 21/04/2025