భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని నవరత్న కంపెనీ, ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక అయిన వారు ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ నావల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ లాండ్ సిస్టమ్స్ హైదరాబాద్ నందు పని చేయవలసి వుంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 32 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ – 08
- టెక్నీషియన్ – సి – 21
- జూనియర్ అసిస్టెంట్ – 03
🔥 విద్యార్హత :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- టెక్నీషియన్ – సి :
- పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, ఐటిఐ మరియు ఒక సంవత్సరం అప్రెంటిస్ పూర్తిచేసి వుండాలి.
(లేదా)
- పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, 3 సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత సాధించాలి.
- జూనియర్ అసిస్టెంట్ :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి బి.కమ్ / బిబిఎం ఉత్తీర్ణత సాధించాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 28 సంవత్సరాల లోపు గల వారై వుండాలి.
- ఓబీసీ (NCL) వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయోసదలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు 250/- + GST ను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ ఏక్స్ సర్వీస్ మాన్ , దివ్యాంగులు కి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
🔥 జీతం :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 24,500/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి 90,000 /- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
- టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 21,500/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి 82,000 /- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
- వివిధ అలోవన్స్ లు కూడా లభిస్తాయి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- 150 మార్కులకు గాను ఎంపిక నిర్వహిస్తారు.ఇందులో భాగంగా జనరల్ ఆప్టిట్యూడ్ 50 మార్కులకు & టెక్నికల్ ఆప్టిట్యూడ్ 100 మార్కులకు గాను వుంటాయి.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 09/04/2025
👉 Click here for official website