భారత ఆర్మీ , ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసు గుంటూరు నుండి 2025-26 సంవత్సరానికి గాను అగ్నిపధ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఉద్యోగాల ఎంపిక నిమిత్తం అర్హత కలిగిన పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానించేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🏹 రైల్వేలో 9,900 ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ ఉద్యోగాలకు కర్నూల్ , శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య మరియు శ్రీ సత్య సాయి జిల్లా కు చెందిన అవివాహితులు అయిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ ఆర్మీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అగ్నిపధ్ పథకం లో భాగంగా అగ్నివీర్ (జనరల్ డ్యూటీ) , అగ్నివీర్ (టెక్నికల్) , అగ్నివీర్ (క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ (ట్రేడ్స్ మాన్ – 10th పాస్), అగ్నివీర్ (ట్రేడ్స్ మాన్ – 8 th పాస్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- అగ్నివీర్ (జనరల్ డ్యూటీ) :
- 45 శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- అగ్నివీర్ (టెక్నికల్) :
- ఫిజిక్స్ , సైన్స్, మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టు లను కలిగి వున్న 10+2 / ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించాలి.
- సరాసరిగా 50 శాతం మార్కులు & ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొంది వుండాలి.
(లేదా)
- ఫిజిక్స్ ,సైన్స్, మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టు లను కలిగి వున్న 10+2 / ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించాలి మరియు NSQF లెవెల్ 4 లేదా అంతకి మించిన స్థాయి లో ఒక సంవత్సర కాలం పాటు గల ITI కోర్సు ఉత్తీర్ణత సాధించాలి.
(లేదా)
- పదవ తరగతి ఉత్తీర్ణత (50 శాతం సరాసరి,ప్రతి సబ్జెక్టు లో 40 శాతం మార్కులు) తో 2 సంవత్సరాల ఐటిఐ/ రెండు లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- అగ్నివీర్ (క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్) :
- ఆర్ట్స్/ కామర్స్/ సైన్స్ విభాగాలలో 60 మార్కుల సరాసరి మరియు ప్రతి సబ్జెక్టు లో 50 శాతం మార్కులు తో 10+2 / ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత.
- 12వ తరగతి లో 50 శాతం మార్కులతో ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ ఉత్తీర్ణత తప్పనిసరి.
- అగ్నివీర్ (ట్రేడ్స్ మెన్ 10th పాస్) :
- పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- అగ్నివీర్ (ట్రేడ్స్ మెన్ 8th పాస్) :
- 8వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17½ సంవత్సరాల 21 సంవత్సరాల లోపు గల వారై వుండాలి.
- 01-01- 2005 నుండి 01-07-2008 లోపు గా జన్మించిన వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
🔥 ఫిజికల్ స్టాండర్డ్స్ :
1.కనీస ఎత్తు :
- అగ్నివేర్ Gd అభ్యర్ధులు – 166 సెంటి మీటర్లు, అగ్నివీర్ టెక్నికల్ అభ్యర్థులు 165 సెంటీమీటర్ల, అగ్నివీర్(క్లర్క్/ స్టోర్ కీపర్) అభ్యర్ధులు 162 సెంటీ మీటర్లు కనీస ఎత్తు కలిగి వుండాలి.
2.కనీస ఛాతీ :
- అందరు అభ్యర్థులు 77 సెంటీమీటర్ల ఛాతీ కలిగి , 5 సెంటిమీటర్లు వ్యాకోచం కలిగి వుండాలి.
3.కనీస బరువు :
- ఎత్తుకు తగ్గ బరువు కలిగి వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో మార్చ్ 12 నుండి ఏప్రిల్ 10 వ తారీఖు లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు 250/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఆన్లైన్ వ్రాత పరీక్ష (ఫేజ్ – 1) , రిక్రూట్మెంట్ ర్యాలీ (ఫేజ్ – 2)నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష విధానం (ఫేజ్ -1) :
- ఆన్లైన్ విధానం ద్వారా జరుగే ఈ పరీక్ష లో ఒక గంటకు 50 ప్రశ్నలు లేదా రెండు గంటలకు 100 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇస్తారు
- వ్రాత పరీక్ష ఇంగ్లీష్ ,హిందీ భాషలలో పాటు తెలుగు లో కూడా నిర్వహిస్తారు.
- అగ్నివీర్( క్లర్క్/ స్టోర్ కీపర్) ఉద్యోగాలకు టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 రిక్రూట్మెంట్ ర్యాలీ (ఫేజ్ -2) :
- ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ : ఇందులో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగు, పుల్ అప్స్, జిగ్ జాగ్ బాల్, 9ft డిచ్ వంటివి క్వాలిఫై అవ్వాలి.
- ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ : అభ్యర్ధులు తగిన ఎత్తు, బరువు, ఛాతీ వంటి శారీరక సామర్థ్యాన్ని కలిగి వుండాలి.
- అడాప్టబిలిటీ టెస్ట్ : అభ్యర్థి ఉద్యోగ పరిస్థితులకు అనువుగా వుండగలడా లేదా అన్న అంశాన్ని ఇందులో పరిశీలిస్తారు.
- మెడికల్ ఎగ్జామినేషన్ : చివరిగా వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి
- మొదటి సంవత్సరం – 30,000/- రూపాయలు (నెలకు)
- రెండవ సంవత్సరం – 33,000/- రూపాయలు (నెలకు)
- మూడవ సంవత్సరం – 36,500/- రూపాయలు (నెలకు)
- నాల్గవ సంవత్సరం – 40,000/- రూపాయలు (నెలకు) జీతం లభిస్తుంది.
- ఇందులో 70 శాతం ఉద్యోగులకు ఇచ్చి , 30 శాతం కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు.
- ఉద్యోగులు ఎంత అయితే కార్పస్ ఫండ్ కి జమ చేస్తారో అంత అదనపు మొత్తాన్ని భారత ప్రభుత్వం కార్పస్ ఫండ్ కి జమ చేస్తాడు.
🔥 ముఖ్యమైన అంశాలు :
- అభ్యర్థులు ఏవైనా రెండు కేటగిరీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది :12/03//2025.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 10/04/2025.
- ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహణ: జూన్ 2025 (తాత్కాలికం)
👉 Click here for official website