తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ నిమిత్తం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఉగాది నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ప్రణాళికను సిద్ధం చేస్తుంది.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని విభాగాలలో & శాఖలలో 61,579 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఇందుకు గాను 2025-26 వ సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం భర్తీ చేయబోతుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం అన్ని శాఖలలో భర్తీ జరపనున్నారు. మొత్తం 61,579 ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్ కేలండర్ విడుదల చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాలలో 6,399 టీచర్ ఉద్యోగాలు.
అంగన్వాడీ కేంద్రాలలో 7837 హెల్పర్ ఉద్యోగాలు
రెవిన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలు.
ఇతర విభాగాలలో 30,238 ఉద్యోగాలు.
గ్రూప్ 1,2,3 కేటగిరీలో 2,711 ఉద్యోగాలు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్ మరియు హెల్ప్ ఉద్యోగాలు.
రెవిన్యూ శాఖలో గ్రామ పరిపాలనా అధికారులు.
గ్రూప్ – 1& గ్రూప్ -2 & గ్రూప్ – 3 ఉద్యోగాలు.
వీటితో పాటు ఇతర శాఖలలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
🔥 విద్యార్హత:
పదవ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ , డిప్లొమా వంటి వివిధ విద్యార్హతలు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 గరిష్ఠ వయస్సు :
18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయొసడలింపు లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం:
విడుదల అయ్యే నోటిఫికేషన్ లో ప్రస్తావించిన విధంగా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
🔥 ఎంపిక విధానం :
మెరిట్ మార్కుల ఆధారంగా లేదా వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన అంశాలు:
ఉగాది పండగ తర్వాత వారం , పది రోజులలో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.
ప్రభుత్వం 2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు వివిధ శాఖలలో 58,868 ఉద్యోగాలను భర్తీ చేసింది.
స్కిల్ యూనివర్సిటీ మరియు హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్ టైల్ ఇన్స్టిట్యూట్ లలో కూడా అవసరమైన పోస్టులను భర్తీ చేస్తారు.
ఆర్థిక ,న్యాయ శాఖ ,సచివాలయం ,సమీకృత గురుకులాల్లో దాదాపు 30,228 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ప్రభుత్వం ఉద్యోగ భర్తీ కొరకు ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చలు జరిపింది.& అతి త్వరలోనే శాఖల వారీగా ఉన్నతాధికారులు తో నోటిఫికేషన్లు జారీ చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్లు విడుదల అయ్యాక, మరో ఆర్టికల్ లో ఒక్కొక్క నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియచేయడం జరుగుతుంది.
అభ్యర్థులు అందరూ ఇప్పటి నుండే ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవ్వడం వలన సిలబస్ పూర్తి చేసి, పరీక్షను బాగా రాసి ఉద్యోగాన్ని పొందగలరు అని ఆశిస్తున్నాం.