Headlines

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది | AP District Court Jobs Recruitment Notification Released | AP Court Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా  డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థలో టైపిస్ట్ ఉద్యోగాన్ని ఔట్ సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఓపెన్ కేటగిరీ లో మహిళా అభ్యర్థులకు ఈ ఉద్యోగం రిజర్వ్ చేయబడింది.

కేవలం డిగ్రీ అర్హత తో టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 


📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ , విజయనగరం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

01 ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

టైపిస్ట్ కమ్ అసిస్టంట్ ఉద్యోగాన్ని అవుట్సోర్సింగ్ ప్రాదిపతికన భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

దీనితో పాటు టైప్ రైటింగ్ (హైయర్ గ్రేడ్) లో  గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత అర్హత కలిగిన వారు లేకపోతే లోయర్ గ్రేడ్ వారిని అర్హులుగా భావిస్తారు.

కంప్యూటర్ , షార్ట్ హ్యాండ్ వంటి అంశాలపై నైపుణ్యత కలిగిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది.

🔥  వయస్సు :

18 సంవత్సరాలు నిండి యుండి , 42 సంవత్సరాల లోపు వయస్సు వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ను ఫిల్ చేసి , సంబంధిత ధృవపత్రాలు  అటెస్టేషన్ తో 25/03/2025 లోగా కార్యాలయంనకు అందజేయాలి.

🔥 దరఖాస్తు చిరునామా

CHAIRMAN , DISTRICT LEGAL SERVICES AUTHORITY , COURT COMPLEX, VIZIANAGARAM అనే చిరునామాలో అందజేయాలి.

🔥 ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు. 

🔥 జీతం : 

ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 18,500/- రూపాయల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు :

దరఖాస్తు చేయడానికి చివరి తేది : 25/03/2025 (సాయంత్రం 5:00 గంటల లోగా) 

👉 Click here for notification and Application 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!