Headlines

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Latest jobs Notifications | Andhra Pradesh Contract Basis Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళాభివృద్ధి  మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి , పోషణ్ అభియాన్ వంటి పథకాల అమలు కొరకు ఈ ఉద్యోగ భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. అభ్యర్థులు వివరాలన్నీ స్పష్టంగా తెలుసుకున్న తరువాత అప్లై చేయండి.

🏹  పోలవరం నీటిపారుదల ప్రాజెక్టులో పదో తరగతి, డిగ్రీ, డిప్లమో, బిటెక్ అర్హతలతో ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ నంద్యాల జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య: 

  • అన్ని విభాగాలలో కలిపి ఆరు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  1. మిషన్ వాత్సల్య పథకం: 
  • డాక్టర్ 
  • కుక్
  • హెల్పర్ కం కాపలాదారురాలు
  • పిటి ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్
  1.  మిషన్ శక్తి పథకం:
  • సైకో సోషల్ కౌన్సిలర్ (మహిళ)
  1.  పోషణ అభియాన్: 
  • జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ (జనరల్)

🔥 విద్యార్హత: 

  • డాక్టర్ (పార్ట్ టైం) : కనీసం ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉండి పాడియాట్రిక్  మెడిసిన్ లో స్పెషలైజేషన్ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటుగా సాధారణ సమయాల్లో మరియు ఎమర్జెన్సీ సమయాల్లో సర్వ శిక్ష అభియాన్ కు  సమయాన్ని కేటాయించగలిగి ఉండాలి.
  • కుక్ : గుర్తింపు పొందిన సంస్థలలో మూడు సంవత్సరాల వంట చేసిన అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణత అయిన ఉత్తీర్ణత కాకపోయినా సరే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • హెల్పర్ కం కాపలాదారురాలు : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థల నందు ఇంటిపని మరియు వంటపని నందు మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. 7వ తరగతి ఉత్తీర్ణత అయినా ఉత్తీర్ణత కాకపోయినా సరే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి.
  • పిటి ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ : ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ లో డిగ్రీ లేదా డిప్లమో పూర్తి చేసి వుండాలి. సంబంధిత విభాగంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలలో పని అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.
  • సైకో సోషల్ కౌన్సిలర్ (మహిళ): సైకాలజీ సైకోమెట్రీ లేదా న్యూరో సైన్స్ విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది.
  • జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ (జనరల్): మేనేజ్మెంట్ లేదా న్యూట్రిషన్ లేదా సోషల్ సైన్సెస్ విభాగాలలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుకేషన్ డిప్లమో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు రెండు సంవత్సరాల పని అనుభవం సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి.

🔥  వయస్సు :

  • డాక్టర్ , సైకో సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు గా ఉండాలి.
  • జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ (జనరల్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 25 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు లోపు గా ఉండాలి.
  • కుక్ ,  హెల్పర్ కమ్ రాత్రి కాపలా దారురాలు మరియు పిటి ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా  టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలలోపు ఉండాలి. 
  • ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఫార్మేట్ ను ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి సంకతం తో జతచేసి కార్యాలయానికి చేరవేయాలి.
  • దరఖాస్తు తో పాటుగా తమ సొంత ఇంటి చిరునామాను రాసిన రెండు పోస్ట్ కవర్లను కూడా దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.
  • పార్ట్ టైం డాక్టర్ మరియు జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు మినహా మిగతా అన్ని ఉద్యోగాలకు కూడా మహిళా అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవలెను.
  • ఈ ఉద్యోగాలు నంద్యాల జిల్లా ప్రాంత అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించి ఉన్నారు కావున అభ్యర్థులు లేటెస్ట్ నివాస ధ్రువీకరణ పత్రం పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది.
  • అభ్యర్థి చెక్ లిస్ట్ ను కూడా ఫిల్ చేయవలెను.
  • ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.

🏹 AP లో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవ పత్రాలు :

  • నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అన్ని ధృవ పత్రాలు అనగా విద్యార్హతలు , కులం, పుట్టిన తేదీ నివాసం మొదలగు పత్రములను స్వీయ ధ్రువీకరణ చేసి జత పరచవలెను.

🔥దరఖాస్తు అందచేయవలసిన చిరునామా:

  • జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు మహిళా సాధికారిత అధికారిని , ఇంటి నెంబర్ 25-427-10A3, దాబరాల్ మసీదు దగ్గర , సంజీవ్ నగర్ , నంద్యాల.

🔥 ఎంపిక విధానం :

  • షార్ట్ లిస్ట్ కాబడిన వారికి మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి , ఎంపిక చేస్తారు.

🔥 జీతం :

  • డాక్టర్( పార్ట్ టైం) – 9930 రూపాయలు
  • కుక్ – 9930 రూపాయలు
  • హెల్పర్ కం రాత్రి కాపలాదారురాలు – 794 రూపాయలు
  • పిటి ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ – 10000  రూపాయలు
  • సైకో సోషల్ కౌన్సిలర్ (మహిళ) – 20000 రూపాయలు
  • జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ (జనరల్) – 18 వేల రూపాయలు.

 🔥 ముఖ్యమైన తేదిలు :

  • దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 19/03/2025 ఉదయం 10:30 నుండి.
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 29/03/2025 సాయంత్రం 5:00 గంటల వరకు.

👉  Click here to download notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!