ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) నుండి జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
🏹 AP లో పదో తరగతి అర్హతతో గ్రేడ్-4 ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ (మెకానికల్ ఇంజనీరింగ్) , ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్ ఇంజినీరింగ్), ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటరు సైన్స్), ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
డిగ్రీ, B.Tech, డిప్లొమా, ITI వంటి విద్యార్హతలు ఉండాలి.
🔥 వయస్సు:
గరిష్ట వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , ఒబీసీ వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులకి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :
SC, ST, PwD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
UR / EWS / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/-
🔥 జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 32,000/- నుండి 35,000/- వరకు జీతం ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 15/03/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 31/03/2025