భారత ప్రభుత్వం , రెవెన్యు డిపార్టుమెంటు పరిధిలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంత ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ , సంస్ధ వారి నుండి వివిధ క్రీడలలో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 2 (స్టేనో) , టాక్స్ అసిస్టంట్ (TA), మల్టి టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అర్హత వున్న అభ్యర్ధులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అన్ని ఉద్యోగాలకు కలిపి ఒకే అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
📢 Cognizant లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 56 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 2 (స్టేనో) – 02
టాక్స్ అసిస్టంట్ ( TA) – 28
మల్టి టాస్కింగ్ స్టాఫ్ (MTS) -26
🔥 విద్యార్హత :
ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 2 (స్టేనో) :
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12 వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
టాక్స్ అసిస్టంట్ ( TA) :
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
మల్టి టాస్కింగ్ స్టాఫ్ (MTS) :
పదవ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
🔥 వయస్సు :
స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 2 (స్టేనో) , టాక్స్ అసిస్టంట్ ( TA) ఉద్యోగాలకు 18 సంవత్సరాల వయస్సు నిండి 27 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మల్టి టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 01/01/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో తేది: 05/04/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపికా విధానం:
అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ టెస్ట్(స్టేనోగ్రాఫర్ & టాక్స్ అసిస్టెంట్ వారికి) వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥జీతం :
స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 2 (స్టేనో) , టాక్స్ అసిస్టంట్ ( TA) ఉద్యోగాలకు లెవెల్ – 4 ( 25,500 – 81,100) /- పే స్కేల్ జీతం లభిస్తుంది.
మల్టి టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలకు లెవెల్ -1 ( 18,000 – 56,900) /- పే స్కేల్ జీతం లభిస్తుంది.
వీటితో పాటు DA,HRA, మెడికల్ అలవాన్స్,ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ వంటివి లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు:
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 15/03/2025.
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 05/04/2025.