రైల్వేలో ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి ముఖ్యమైన అప్డేట్. 2024లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ (CEN RPF 02/2024) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో స్వీకరించారు. తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ భాగంలో నిర్వహించాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలను ప్రకటించింది.
ఈ పరీక్షలు మార్చి 2వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🏹 Download Hall Tickets – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం :
- పైన ఇచ్చిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేస్తే అధికారిక వెబ్సైట్ లో లాగిన్ వివరాలుతో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- దీనికోసం అభ్యర్థులు తాము అప్లై చేసినప్పుడు వారికి కేటాయించిన రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ (పుట్టిన తేదీ) వివరాలు నమోదు చేసి లాగిన్ అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అవకాశం ఉంటుంది.
🏹 DRDO లో పరీక్ష లేకుండా జాబ్స్ – Click here
🔥 పరీక్ష విధానం :
- పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులకు గాను కేటాయిస్తారు.
- పరీక్ష మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. సరైన సమాధానానికి ఒక మార్క్ ఉంటుంది. తప్పు సమాధానానికి ⅓ వంతు మార్కు తగ్గిస్తారు.
- పరీక్షలో అర్థమెటిక్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు కేటాయిస్తారు.
🔥 హాల్ టికెట్స్ లో ఉండే వివరాలు :
- హాల్ టికెట్ లో అభ్యర్థుల పేరు, రోల్ నెంబర్, పరీక్ష తేదీ మరియు సమయం, పరీక్ష ప్రదేశం వివరాలు, రిపోర్టింగ్ టైం, ఫోటో మరియు సంతకం, పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు వంటి వివరాలన్నీ ఉంటాయి.
🔥 ఈ ఉద్యోగాల ఎంపిక విధానం క్రింది విధంగా ఉంటుంది :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 Download Hall Tickets – Click here