AP లో 45,000/- జీతంతో సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIIMS Field Data Collector Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఒక ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు తమ Updated CV ను మార్చి రెండవ తేదీ లోపు ap.nmhs2cen@nimhans.net అనే మెయిల్ అడ్రస్ కు పంపించి మార్చి 4వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. 

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. AIIMS మంగళగిరి నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా “ నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఇన్ ఇండియా ఫేజ్ 2 “ అనే ప్రాజెక్టులో NMHS సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 పోస్టుల పేర్లు : 

  • NMHS సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 అర్హత :

  • సైకాలజీ లేదా సోషియాలజీ లేదా సోషల్ వర్క్ లేదా రూరల్ డెవలప్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు 
  • SC, ST, OBC అభ్యర్థులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు

🔥 జీతము : 

  • ఎంపికైన వారికి నెలకు 45,000/- రూపాయలు జీతం ఇస్తారు. 

🔥 ఫీజు : 

  • ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • మార్చి 4వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

🔥 అప్లై విధానము : 

  • ఈ పోస్టులకు అర్హత కలిగిన ముందుగా తమ Updated CV ను మార్చి రెండవ తేదీ లోపు ap.nmhs2cen@nimhans.net అనే మెయిల్ అడ్రస్ కు పంపించి మార్చి 4వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. 
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా ఒరిజినల్ సర్టిఫికెట్స్ యొక్క ఒక సెట్ సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలుతో హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ : 

  • SSC సర్టిఫికేట్ / 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్
  • విద్యా అర్హత సర్టిఫికెట్లు 
  • పని మరియు పరిశోధన అనుభవ సర్టిఫికెట్లు
  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 
  • ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్ / పాస్‌పోర్ట్ / ఓటరు ఐడి వంటి చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్. 
  • Updated CV

🔥 ఎంపిక విధానం : 

  • ఈ పోస్టులకు ఎక్కువమంది అభ్యర్థులు అప్లై చేసుకుంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. లేకపోతే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

  • అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, AIIMS మంగళగిరి వద్ద ఇంటర్వ్యూలు జరుగుతాయి.
  • 04-03-2025 తేదిన ఉదయం 8:30 కు ప్రారంభమయ్యే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ కు అభ్యర్థులు హాజరవ్వాలి. 
  • ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. 

🔥 ఉద్యోగ కాల పరిమితి : 

  • ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో ఆరు నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్టు అవసరం మరియు అభ్యర్థి పనితీరు ఆధారంగా కొనసాగిస్తారు. 

🏹  గమనిక :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఇంటర్వ్యూలు జరిగే తేదీలలో స్వయంగా హాజరవ్వండి.

🏹 Download Notifications – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!