నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నుండి సైంటిఫిక్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 18వ తేదీలోపు సబ్మిట్ చేయాలి.
🏹 తిరుపతి IIT లో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) అనే ప్రభుత్వ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- సైంటిఫిక్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ & నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ / సాఫ్ట్‌వేర్ సిస్టమ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్టులలో B.E / B.Tech / M.Sc పూర్తి చేసి ఉండాలి.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC / ST / PwBD / మహిళ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 800/- రూపాయలు.
🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 17వ తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 18వ తేదీలలోపు సబ్మిట్ చేయాలి.
🔥 జీతము వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు 35,400/- నుండి 1,12,400/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 వయస్సు :
- 18-03-2025 నాటికి వయస్సు గరిష్ఠంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🏹 సికింద్రాబాద్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అర్హత ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు :
- దేశవ్యాప్తంగా 14 పట్టణాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- 1) అగర్తల 2) బెంగళూరు 3) కాలికట్ 4) చండీగఢ్ 5) చెన్నై 6) ఢిల్లీ 7) గౌహతి 8) హైదరాబాద్ 9) జైపూర్ 10) జమ్మూ 11) కోల్‌కతా (12) లక్నో (13) ముంబై 14) పాట్నా.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Notification – Click here