ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న DSC నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ DSC నోటిఫికేషన్ చేస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని తెలిపింది. విద్యా శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైలు పైన తన తొలి సంతకం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో మొత్తం 16,347 పోస్టులు భర్తీకి అయిన ఆమోదం తెలిపారు.
🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥గతంలో వచ్చిన సమాచారం ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ – 7,725 పోస్టులు
- SGT – 6,371 పోస్టులు
- TGT – 1781 పోస్టులు
- PGT – 286 పోస్టులు
- ప్రిన్సిపల్స్ – 52 పోస్టులు
- పిఈటి – 132 పోస్టులు
🔥 భర్తీ చేయబోయే పోస్టులలో జిల్లా పరిషత్ , మండల పరిషత్ మరియు మున్సిపల్ స్కూల్స్ లో 14,066 పోస్టులు ఉన్నాయి.
🔥 రెసిడెన్షియల్ స్కూల్స్ , మోడల్ స్కూల్స్ , బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
🔥పూర్వపు జిల్లాల ప్రకారం జిల్లాలు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
- శ్రీకాకుళం – 543
- విజయనగరం – 583
- విశాఖపట్నం – 1134
- తూర్పుగోదావరి – 1346
- పశ్చిమగోదావరి – 1067
- కృష్ణ – 1213
- గుంటూరు – 1159
- ప్రకాశం – 672
- నెల్లూరు – 673
- చిత్తూరు – 1478
- కడప – 709
- అనంతపురం – 811
- కర్నూలు – 2678