ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతూ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది
ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి, డిగ్రీ వంటి సాధారణ విద్యార్హతలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులు పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
అర్హత ఉండే నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 22వ తేదీలోపు అందజేయాలని నోటిఫికేషన్ లో తెలిపారు. ఎంపికైన వారికి మార్చి 24వ తేదీన నియామక పత్రాలు అందజేస్తారు.
🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ ,SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ & గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఆరోగ్య సంస్థల్లో ఉన్న 66 ఖాళీలను భర్తీ చేసేందుకు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
🏹 భర్తీ చేస్తున్న పోస్టులు – విద్యార్హతలు :
- భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ , ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్ , అటెండర్లు, C. ఆర్మ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, EEG టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, అనస్తీసియా టెక్నీషియన్, మార్చరీ మెకానిక్ పోస్టులు ఉన్నాయి.
- ఇందులో పదో తరగతి అర్హత ఉన్నవారు జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, అటెండర్ అనే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- డిగ్రీ విద్యార్హత ఉన్నవారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- పోస్టులను అనుసరించి సంబంధిత డిప్లమో లేదా డిగ్రీ వంటి పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారు మిగతా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🏹 ఎంపిక విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు గతంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసినట్లయితే వారికి వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం మార్కుల మెడిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు.
🏹 అప్లికేషన్ విధానము :
- అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 22వ తేదీలోపు ఫిబ్రవరి 22వ తేదీలోపు తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో అందజేయాలి.
🏹 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ, బీసీ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- OC అభ్యర్థులు మాత్రమే 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
🏹 జీతము వివరాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి కనీసం 15,000/- నుండి గరిష్టంగా 32,670/- వరకు జీతం ఇస్తారు.
🏹 Download Notification – Click here
🏹 Download Application – Click here
🏹 Official Website – Click here