ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలను ఆరు నెలల్లోని భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారు తెలిపారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆరు నెలల్లో అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి కూడా రావడం జరిగింది.
నిరుద్యోగుల అవగాహన కోసం ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వబడినవి.
🏹 ఆంధ్రప్రదేశ్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ పేరు :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- తాజా ప్రకటన ప్రకారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబోతున్నారు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
🔥 అర్హత :
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులు.
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🏹 ఏపీలో పదో తరగతి అర్హతతో అవుట్సోర్సింగ్ జాబ్స్ – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు వివరాలు వెల్లడిస్తారు.
🔥 పోస్టింగ్ ప్రదేశం :
- అనంతపురం , గుంటూరు కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, FDPT శ్రీశైలం సర్కిల్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానము :
- నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష మరియు వాకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.