12th / ఇంటర్ పాస్ అయిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ | CSIR – IICT Junior Secretariat Assistant Recruitment 2025 | Latest Government Jobs Alerts in Telugu 

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR – ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR – IICT) నుండి జూనియర్ సెక్రటరియట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి పాస్ అయిన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31-01-2025 నుండి 03-03-2025 తేది లోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి. 

🏹 తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్ ఇవే – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • CSIR – ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR – IICT) నుండి విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • జనరల్ , F&A, S&P కేటగిరీలలో జూనియర్ సెక్రటరియట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందు CSIR – IIST అనే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 15 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
  • కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • జూనియర్ సెక్రటరియట్ (GEN) – 10 పోస్టులు
  • జూనియర్ సెక్రటరియట్ (F&A) – 02 పోస్టులు 
  • జూనియర్ సెక్రటరియట్ (S&T) – 03 పోస్టులు 
Oplus_131072

🔥 విద్యార్హతలు

  • 12th పాస్ విద్యార్హత ఉండాలి.
  • కంప్యూటర్ పైన ఇంగ్లీషులో నిమిషానికి 35 ఫలితాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగల సామర్థ్యం ఉండాలి.

🔥 జీతము వివరాలు : 

  • లెవల్-2 ప్రకారం జీతము పే స్కేల్ ఉంటుంది.
  • అన్ని రకాల అలవెన్సులు కలిపి ప్రారంభంలో నెలకు 38,483/- జీతము ఇస్తారు. 

🏹 డిగ్రీ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here 

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సులో 28 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • PwBD అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఇచ్చారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • SC, ST, PwBD, మహిళలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
  • మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష / OMR ఆధారిత పరీక్ష మరియు టైప్ రైటింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 31-01-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు 03-03-2025 తేదీలోపు అప్లై చేయాలి.

🔥 గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివిన తరువాత ఆన్లైన్లో అప్లై చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రిందన ఇవ్వబడినవి.

📌 Join Our Telegram Channel

🏹 Download Notification – Click here 

🏹 Official Website – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!