తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారో ముందుగానే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రకటించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండడంతో ఇంతకాలం నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.
ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని వివరాలతో అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిగా ఉభయ సభలు ఈ నివేదికను ఆమోదించాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలైన తరువాత వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ బోర్డులు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నాయి. ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రిక్రూట్మెంట్ బోర్డులు సిద్ధంగా ఉన్నాయి.
నోటిఫికేషన్స్ విడుదల చేసినప్పటి నుంచి ఆరు నెలల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే విధంగా ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది.
🏹 10th, 12th విద్యార్హతలతో ఉద్యోగాలు – Click here
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ సంవత్సరం విడుదలయ్యే నోటిఫికేషన్స్ :
- ముందుగా టెట్ ఫలితాలు విడుదల చేసి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది.
- గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, ఎస్సై , కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి.
- సింగరేణిలో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
- టెక్నికల్ పోస్టులైన ఏఈ , ఏఈఈ మరియు లైన్ మెన్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు.