ఆంధ్రప్రదేశ్ లో భారీగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Contract / Outsourcing Jobs Recruitment 2025 | Latest Government jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 22వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. 

భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో పదో తరగతి, డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా పోస్టులు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🏹 AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు – Click here 

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఈ నోటిఫికేషన్ తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్వపు చిత్తూరు జిల్లా ప్రకారం వివిధ ఆరోగ్య సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసినందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, FNO, MNO, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్, అటెండర్, ఫిజియోథెరపిస్ట్, C- ఆర్మ్ టెక్నీషియన్, O.T టెక్నీషియన్, EEG టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, మార్చురీ మెకానిక్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో
  • ఎస్వీ మెడికల్ కాలేజ్ 27 పోస్టులు , SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో 27 పోస్టులు, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో 8 పోస్టులు, శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఒక పోస్టు, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో మూడు పోస్టులు ఉన్నాయి.

🔥 విద్యార్హతలు : 

  • ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, DMLT, B.Sc (MLT) , బీఎస్సీ అనస్థీషియా, బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ: 

  • 07-02-2025 తేదిన నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 07-02-2025 తేది నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 22-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనలో ప్రకారం SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

🔥 జీతము వివరాలు : 

  • ల్యాబ్ అటెండెంట్ – 15,000/-
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
  • లైబ్రెరీ అటెండెంట్ – 15,000/-
  • ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ – 32,670/-
  • డయాలసిస్ టెక్నీషియన్ – 32,670/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,500/-
  • FNO – 15,000/-
  • MNO – 15,000/-
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 15,000/-
  • ఆడియో మెట్రి టెక్నీషియన్ – 32,670/-
  • ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ – 22,460/-
  • అటెండర్ – 15,000/-
  • ఫిజియోథెరపిస్ట్ – 35,570/-
  • C- ఆర్మ్ టెక్నీషియన్ – 32,670/-
  • O.T టెక్నీషియన్ – 32,670/-
  • EEG టెక్నీషియన్ – 32,670/-
  • డయాలసిస్ టెక్నీషియన్ – 32,670/-
  • అనస్థీషియా టెక్నీషియన్ – 32,670/-
  • మార్చురీ మెకానిక్ – 18,000/-

🏹 సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే OC అభ్యర్థులు 300/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, BC, Physically Challenged అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : 

  • క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు జతపరిచి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

  • ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి

🏹 Download Notification – Click here 

🏹 Download Application – Click here 

🏹 Official Website – Click here 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!