ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగానికి అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షను మార్చి 16వ తేదీన నిర్వహిస్తామని నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది.
కాబట్టి అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుని ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోండి.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- మచిలీపట్నం వద్ద ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసినందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- BEL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు
🔥 అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు :
- B.Com లేదా BBM లేదా BBA లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉండాలి.
🔥 జీతము వివరాలు :
- BEL భర్తీ చేస్తున్న ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి పే స్కేల్ 21,500/- నుండి 82,000/- ప్రకారము జీతం ఇస్తారు. బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
- CTC 5.94 LPA ఉంటుంది.
🔥 వయస్సు వివరాలు :
- 01-01-2025 నాటికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయస్సు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- UR / OBC / అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250/-
- SC, ST , PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 31-01-2025 నుండి అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు 21-02-2025 తేది నుండి అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష , ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here