ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు మార్చి చివరివారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత పొందిన 95 వేలమందికి 2024 డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు 95,208 మందికి గాను 69 వేలమంది హాజరయ్యారు. హాజరైన వారిలో 39,000 మంది మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయ్యారు. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ఎం.రవి ప్రకాష్ గారు తెలిపారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్టీయూకు అప్పగించామని ఆయన తెలిపారు.
🏹 డిగ్రీ అర్హతతో 1000 బ్యాంకు ఉద్యోగాలు – Click here
మీరు పోలీస్ కానిస్టేబుల్ , సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 2, రైల్వే, బ్యాంక్ , SSC వంటి వివిధ రకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మా APP ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.
సీనియర్ ఫ్యాకల్టీ తో చెప్పిన ఏ క్లాసుల కోర్సు అయినా 499/- Only
🏹 Download our App – Click here
🏹 6100 పోలీస్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 28-11-2022 తేదీన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా 22-01-2023 తేదిన ప్రిలిమినరీ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 35 లొకేషన్స్ లో 997 సెంటర్స్ ఏర్పాటు చేసి నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
- క్వాలిఫై అయిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన శారీరక కొలతలు మరియు శారీరిక సామర్ధ్య పరీక్షలు కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చాయి. ముఖ్యంగా హోంగార్డుల కోటా విషయంలో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ రిక్రూట్మెంట్ వాయిదా పడుతూ వచ్చింది.
- ఎట్టకేలకు శారీరక కొలతలు మరియు శారీరిక సామర్ధ్య పరీక్షలు నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగించుకుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2024 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2025 జనవరి 30వ తేదీ వరకు అభ్యర్థులకు ఈ పరీక్షను నిర్వహించింది. శారీరక కొలతలు మరియు శారీరిక సామర్ధ్య పరీక్షలు పూర్తిచేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పుడు మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
- హోంగార్డుల రిజర్వేషన్ విషయంలో హైకోర్టు తీర్పు మేరకు రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు.
- ఈ పరీక్ష బాధ్యతలను కాకినాడలో ఉన్న జేఎన్టీయూ కు అప్పగించారు.
🔥 Official Website – Click here