కేంద్ర వరి పరిశోధన సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICAR – CRRI Notification 2025 | Latest jobs Notifications

ICAR – సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ , అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్, యంగ్ ప్రొఫెషనల్ -1 అనే ఉద్యోగాలను ఒక ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

సెంట్రల్ రైస్ రీసెర్చ్ నుండి విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ICAR – సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ , అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్, యంగ్ ప్రొఫెషనల్ -1 అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ICAR – సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 04 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
  • గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ – 01
  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ – 02
  • యంగ్ ప్రొఫెషనల్ -1

🔥 విద్యార్హతలు

గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

  • ఈ ఉద్యోగాలకు ఏదైనా సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
  • అగ్రికల్చర్, బొటనీ, మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • M.Sc డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ : 

  • 10th తరువాత అగ్రికల్చర్ లేదా అలైడ్ అగ్రికల్చర్ లో ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. (లేదా)
  • పదో తరగతి అర్హతతో పాటు అగ్రికల్చర్ లేదా అలైడ్ సబ్జెక్ట్ లో రెండేళ్ళ అనుభవం ఉండాలి.
  • 10th తరువాత అగ్రికల్చర్ లేదా అలైడ్ అగ్రికల్చర్ లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

యంగ్ ప్రొఫెషనల్ -1 ఉద్యోగాలు : 

  • వ్యవసాయం / బయోటెక్నాలజీ / పర్యావరణ శాస్త్రం / వృక్షశాస్త్రం / జంతుశాస్త్రం / మైక్రోబయాలజీ లేదా ఏదైనా సంబంధిత సబ్లెక్ట్ లలో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
  • నేల, మొక్క మరియు నీటిలో అనుభవం ల్యాబ్ మరియు ఫీల్డ్‌లో విశ్లేషణ పని ప్రయోగం మరియు తయారీ శాస్త్రీయ / సాంకేతిక నివేదికలు / పత్రాలు, అనుభవం / జ్ఞాన నైపుణ్యం లలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🏹 TTD లో 26,250/- ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 జీతము వివరాలు : 

  • గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 24,000/- జీతము ఇస్తారు.
  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 18,000/- జీతము ఇస్తారు.
  • యంగ్ ప్రొఫెషనల్ -1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 30,000/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు : 

  • గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 21 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • యంగ్ ప్రొఫెషనల్ -1 ఉద్యోగాలకు 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అప్లికేషన్ ఫీజు లేదు.

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఇంటర్వ్యూకు హాజరైతే, వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ తేదీలు : 

  • గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 06-02-2025 తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు 07-02-2025 తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  • యంగ్ ప్రొఫెషనల్ -1 ఉద్యోగాలకు 06-02-2025 తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం : 

  • ICAR-NRRI, కటక్ లో ఇంటర్వ్యు నిర్వహిస్తారు.

🔥 పోస్టింగ్ ఇచ్చే ప్రదేశం : 

  • ICAR-NRRI, కటక్ లో ఎంపికైన వారికి పోస్టింగ్ ఇస్తారు.

🔥 ప్రాజెక్ట్ కాలపరిమితి : 

  • 30-09-2025 వరకు లేదా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పని చేసేందుకు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

📌 Join Our Telegram Channel

🏹 Download Notification  – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!