Headlines

నిరుద్యోగులకు నెలకు 1500/- ఇచ్చే కొత్త పథకం ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం | పూర్తి వివరాలు ఇవే ..

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతుంది. ఈ కోచింగ్ కు ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉచిత కోచింగ్ తో పాటు ప్రతి నెల 1500/- రూపాయలు ప్రభుత్వం అందించబోతుంది.

ఈ ఉచిత కోచింగ్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అందిస్తుంది.. అర్హత ఉండే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 

పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

🏹 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 ఎవరు అర్హులు ? : 

  • తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 

🔥 ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు : 

  • వంద రోజులు పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. 

🔥 ఎక్కడ కోచింగ్ ఇస్తారు ? :

  • తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్ లో ఈ ఉచిత కోచింగ్ ఇస్తారు.

🔥 ఏ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తారు ? :

  • రైల్వే, బ్యాంక్, SSC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ ఉచిత శిక్షణ ఇస్తారు. 

🔥 స్టైఫెండ్ ఎంత ఇస్తారు ? : 

  • ఈ ఉచిత కోచింగ్ కు అర్హత పొందిన వారు ప్రతి నెల 75% హాజరు ఉంటే వారికి 1500/- రూపాయలు స్టైఫెండ్ ఎంత ఇస్తారు..

🔥 ఎలా అప్లై చేయాలి ?

  • ఈ ఉచిత శిక్షణకు తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్స్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. 
  • ఈ శిక్షణకు అవసరమైన లింక్ క్రింది ఇవ్వబడినది దానిపై క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.

🔥 ఉచిత కోచింగ్ నిర్వహించే విధానం : 

  • అత్యంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో ఈ క్లాసులు నిర్వహిస్తారు. 
  • ప్రతిరోజు ఉచిత శిక్షణ ఉంటుంది.
  • అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ ప్రిటేషన్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, GK, ఇండియన్ పాలిటి, ఇండియన్ ఎకానమీ , ఇండియన్ జాగ్రఫీ,  ఇండియన్ హిస్టరీ, కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపరమైన సబ్జెక్టులను అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బోధిస్తారు.

🔥 అప్లికేషన్ తేదీలు :

  • ఉచిత శిక్షణకు అప్లై చేయాలి అనుకునే నిరుద్యోగులు ఆన్లైన్ లో జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 
  • అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, కాబట్టి అర్హత ఉండే నిరుద్యోగులు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్, డిగ్రీ అర్హతలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • మొత్తం సీట్లలో SC రిజర్వేషన్ అభ్యర్థులకు 15% , ST రిజర్వేషన్ అభ్యర్థులకు 5% , BC – A రిజర్వేషన్ అభ్యర్థులకు 18% , BC – B రిజర్వేషన్ అభ్యర్థులకు 26% , BC – C రిజర్వేషన్ అభ్యర్థులకు 3% , BC – D రిజర్వేషన్ అభ్యర్థులకు 18% సీట్లు కేటాయిస్తారు.

🔥 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు : 

  • అర్హత గల వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు.

🔥 ఎప్పటినుండి ఈ ఉచిత కోచింగ్ ప్రారంభం ?

  • ఈ ఉచిత శిక్షణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిల్స్ లో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

🔥 సంప్రదించవలసిన నెంబర్ : 

  • అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-24071178 అనే నంబర్ కు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

🔥 Apply Link – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!