ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల వనరుల శాఖలో 250 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్లో ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ముఖ్యమైన సమాచారం వచ్చింది, ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
🏹 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖలో ప్రస్తుతం పదోన్నతులు కల్పించారు. ఇందులో 43 మంది సూపరింటెంటింగ్ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్లుగా, 43 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను సూపర్ ఇంటెండింగ్ ఇంజనీర్లుగా, 180 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలో జల వనరుల శాఖలో ఉన్న ఖాళీలు భర్తీపై ఆ శాఖ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖలో 500 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 250 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మంజూరైన 250 పోస్టులను ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతున్న జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేపట్టేందుకు ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపించడానికి ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ కసరత్తు చేస్తుంది.
ఈ శాఖ నుండి ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు అందితే జాబ్ క్యాలెండర్ లో ఈ పోస్టులు కూడా చేర్చి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది.
🏹 తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలో ఉద్యోగాలు – Click here