Headlines

టెన్త్ పాస్ అయిన వారికి రైల్వేలో భారీగా ఉద్యోగాలు | 32,438 జాబ్స్ | RRB Group D Notification 2025 in Telugu | Railway Group D Recruitment 2025 Full Details

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం 32,438 పోస్టులతో పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఐటిఐ విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

కేవలం పదో తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే రైల్వేలో ఉద్యోగం చేసుకోవచ్చు. అభ్యర్థులు సౌత్ సెంట్రల్ జోన్ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికైనట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. 

🏹 BHEL లో 400 జాబ్స్ నోటిఫికేషన్ – Click here 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. ఈ ఉద్యోగాలకు జనవరి 23వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

🏹 రైల్వే గ్రూప్ డి ఆన్లైన్ కోచింగ్ మీకు 499/- కే కావాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి

✅ Download Our App – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

✅ భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో వివిధ రకాల గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం పోస్టుల సంఖ్య : 

  • మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హత : 

  • ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఐటిఐ విద్యార్హత పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ విధానం : 

  • ఆన్లైన్ లో విధానంలో RRB వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ

  • 23-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ

  • 22-02-2025 తేది లోపు ఈ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయాలీ.

🔥 కనీస వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. (01-01-2025 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : 

  • 36 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. (01-01-2025 నాటికి)

🔥 వయస్సులో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

✅ జీతము : 

  • ప్రారంభంలో బేసిక్ పే 18,000/- తో పాటు ఇతర అలవెన్స్ లు ఇస్తారు 

✅ ఫీజు :

  • SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు 250/- (SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు వారు చెల్లించిన పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు)
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు. (400/- రిఫండ్ చేయడం జరుగుతుంది)
  • పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.

🔥 ఎంపిక విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా వంద మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. 
  • 90 నిమిషాల సమయం ఉంటుంది. 
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 
  • ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి

🔥 Download Full Notification – Click here 

🔥 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!